Telangana : తెలంగాణలో ఇక 24 గంటలు వ్యాపారాలు చేసుకోవచ్చు .. షరతులు వర్తిస్తాయి

షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు సవరణలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇకనుంచి తెలంగాణలో 24గంటలు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.

Telangana : తెలంగాణలో ఇక 24 గంటలు వ్యాపారాలు చేసుకోవచ్చు .. షరతులు వర్తిస్తాయి

malls,restaurants,shops 24 hours open In TS

Telangana : తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకనుంచి వ్యాపారాలు 24గంటలు చేసుకోవచ్చని వెల్లడించింది.దీనికి సంబంధించి కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు సవరణలు చేసిన ప్రభుత్వం ఇకనుంచి తెలంగాణలో 24గంటలు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు సవరణతో ఇకనుంచి వారంలో ఏడు రోజులూ 24 గంటలూ ఆయా షాపులు తెరిచి ఉంచుకోవచ్చని వెల్లడించింది. కానీ దీని కోసం అదనంగా ఏడాదికి రూ.10వేలు చెల్లిస్తేనే 24గంటలు తెరిచి వ్యాపారం నిర్వహించుకునే అనుమతి ఉంటుంది. దీనికి సంబంధించి కార్మికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని జీవోను ఏప్రిల్ 4(2023)న విడుదల చేశారు.

తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1988 కింద పేర్కొన్న దుకాణాలు, ఆయా సంస్థలకు సెక్షన్ 7 నుంచి మినహాయింపు లభిస్తుంది.దీనికి సంబంధించి కొన్ని నిబందనలను కచ్చితంగా పాటించాల్సి ఉంది. ఏడాదికి రూ.10వేలు అదనంగా చెల్లించటంతో పాటు ఆయా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, షాపుల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఐడీ కార్డులు ఇవ్వాలి. అలాగే వారాంతపు సెలవులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పని గంటలను కూడా నిర్ధేశించాలి. ఉద్యోగులు షిఫ్ట్‌కు మించి పనిచేస్తే వారు ఎన్ని గంటలు పనిచేసిందీ లెక్కగట్టి అదనపు వేతనం చెల్లించాలి.

అంతేకాదు మహిళా ఉద్యోగుల విషయంలో వారి భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారికి రక్షణ కల్పించాలి. నైట్ షిఫ్ట్‌లో ఉద్యోగులు పని చేయాల్సిన అవసరం ఉంటే వారి అనుమతితోనే చేయించుకోవాలి తప్ప నిర్భంధించి పనిచేయించుకోరాదు. అలాగే ఆయా సంస్థలు నైట్ షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగుల రాకపోకలకు ఏర్పాట్లు చేయాలి. రికార్డులు కచ్చితంగా నిర్వహించాలి. ఆదాయపన్నును సరైన సమయంలో చెల్లించాలి. ఇలా ప్రభుత్వ విధించే నిబంధనలతో ఆయా షాపులు, మాల్స్ 24గంటలు వ్యాపారాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది.