రూ.10 కాయిన్లు నిరాకరించిన బ్యాంకు.. 11వేల 10రూపాయల కాయిన్లతో ఎమ్మార్వో ఆఫీసు ముందు ధర్నా

  • Published By: naveen ,Published On : November 6, 2020 / 03:40 PM IST
రూ.10 కాయిన్లు నిరాకరించిన బ్యాంకు.. 11వేల 10రూపాయల కాయిన్లతో ఎమ్మార్వో ఆఫీసు ముందు ధర్నా

10 rupees coins: ఏ నోట పుట్టిన పుకారో కానీ… 10 రూపాయల కాయిన్లు పత్తా లేకుండా పోయాయి. 10 రూపాయల కాయిన్లు చెల్లవనే ప్రచారం జోరుగా నడుస్తోంది. దీంతో అవి ఎక్కడా కనిపించడం లేదు. వాటిని తీసుకోవడానికి అంతా నిరాకరిస్తున్నారు. అయితే ఆసిఫాబాద్ జిల్లా బోగడ్ అనే ఊరిలో పద్మాకర్ అనే వ్యక్తి దగ్గర 10 రూపాయల బిళ్లలు చాలానే ఉన్నాయి. వంద కాదు వెయ్యి కాదు.. ఏకంగా 11వేల 10 రూపాయల కాయిన్స్ అతడి దగ్గర ఉన్నాయి. తన దగ్గరున్న కాయిన్స్ తీసుకుని పద్మాకర్ బ్యాంకుకి వెళ్లాడు. ఆ కాయిన్స్ వారికి ఇచ్చి తన అకౌంట్ లో వేయాలని చెప్పాడు.

ఇందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించారు. కాయిన్స్ తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. అతడిని బయటకు పంపేశారు. దీంతో పద్మాకర్ కంగుతిన్నాడు. బ్యాంకు సిబ్బంది అలా అనడంతో తెల్లమోహం వేశాడు. తన 10 రూపాయల కాయిన్స్ తీసుకుని ఎమ్మార్వో ఆఫీసు ముందు ధర్నాకి దిగాడు. తనకు న్యాయం చేసే వరకు కదిలేది లేదన్నాడు.


https://10tv.in/one-rupee-coin-can-help-you-earn-rs-lakh/
అసలు పది రూపాయల కాయిన్లు ఎవరూ తీసుకోవడం లేదు కదా. మరి మీ దగ్గర అన్ని కాయిన్లు ఎలా వచ్చాయని అడిగితే.. దాని వెనుక కథ ఏంటో చెప్పాడు పద్మాకర్. పద్మాకర్ కూరగాయలు అమ్ముతాడు. అతడి దగ్గరికి కూరగాయలు కొనేందుకు జనాలు వస్తుంటారు. కొందరు పేదలు 10రూపాయల కాయిన్లు తీసుకుని వచ్చేవారు. అవి చెల్లుబాటు కావనే ప్రచారం నడుస్తున్నా, వారి బాధలు అర్థం చేసుకున్న పద్మాకర్, వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో వారి దగ్గర 10 రూపాయల బిళ్లలు సుకుని వారికి కూరగాయలు ఇచ్చాడు. అలా ఇప్పటివరకు 11వేల 10రూపాయల కాయిన్లు అతడి దగ్గర జమయ్యాయి.

అయినా కాయిన్లు చెల్లవని రిజర్వ్ బ్యాంకు చెప్పిందా? కేంద్ర ప్రభుత్వం ఏమైనా చట్టం తెచ్చిందా? బ్యాంకు వాళ్లు ఎందుకు తీసుకోరు? అన్నీ తెలిసిన బ్యాంకు వాళ్లే ఇలా చేస్తే ఇక పబ్లిక్ కి దిక్కెవరు? పది రూపాయల కాయిన్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్న బ్యాంకులు.. మరి పించన్లు, కరువు ఫండ్ రూపంలో పది రూపాయల కాయిన్లు ఎందుకు ఇస్తున్నారని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు.