MLA Rajasingh Notice : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్పీసీ కింద గురువారం మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

MLA Rajasingh Notice : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

NOTICE

MLA Rajasingh Notice : హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్పీసీ కింద గురువారం మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని 2022, ఆగస్టులో కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై పోలీసు కేసు నమోదు అయింది.

ప్రస్తుతం ఈ కేసు కంచన్ బాగ్ నుంచి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు ఇచ్చారు. రాజాసింగ్ కు వచ్చిన నోటీసులపై ఆయన తరపు న్యాయవాది కరుణ సాగర్ స్పందించారు. పోలీసులు జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇస్తామన్నారు.

Rajasingh: న్యూ ఇయర్ వేడుకలపై బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక

ఫేస్ బుక్ లో నెటిజన్ పెట్టిన పోస్టు కింద రాజాసింగ్ కామెంట్ చేశారు. అయితే ఆయన పెట్టిన కామెంట్ ఓ మతాన్ని కించపరిచినట్లుగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలోనూ రాజాసింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనపై పలు కేసులు ఉన్నాయి.