గాయపడిన కొడుకుని మోస్తూ..900 కిలోమీటర్ల నడక : లాక్‌డౌన్‌లో మరో వలస వేదన

  • Published By: nagamani ,Published On : May 18, 2020 / 10:19 AM IST
గాయపడిన కొడుకుని మోస్తూ..900 కిలోమీటర్ల నడక : లాక్‌డౌన్‌లో మరో వలస వేదన

లాక్ డౌన్ తో ఉన్న ఊరు పొమ్మంటోంది. సొంత ఊరు రమ్మంటోంది. కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. కానీ..మనస్సు నిండా భారం మాత్రం నీతోనే ఉన్నానంటోంది. నెత్తిపై బరువు నిన్ను విడిచి ఉండలేనంటోంది. కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ తో ఉపాధి ఉన్న ఊరికి పొమ్మంటోంది. వలస వచ్చిన వలస కూలీలకు బతుకు కష్టమైపోతోంది. ఎంత కష్టం ఉన్నాసరే..నిన్న కడుపులో పెట్టుకుంటాను వచ్చేయ్..బిడ్డా అంటూ కన్నఊరు చేతులు చాస్తోంది. 

దీంతో వలస కూలీలు తమ బతుకులు ఎలా ఉన్నా తమ బిడ్డలనైనా బతికించుకుందామని గంపెడాశతో వందల కిలోమీటర్లు మండుటెండలో నడిచిపోతున్నారు. ఈ పయనంలో రాలిపోయే ప్రాణాలెన్నో..కడు దీనగాథలకు కలాలుగా మారిన కథలెన్నో..ఎన్నెన్నో..అటువంటి మరో వలస కూలీ దీనాతిదీన గాథ ఇది..

పొట్ట చేత పట్టుకుని పెళ్లాబిడ్డల్ని కూడా పెట్టుకుని..పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్ కు వలస పోయాడు ఓ బడుగు జీవి. ఏదో కాస్తంత బాగానే బతుకుతున్నాడు. కానీ కరోనా కరాళ నృత్యానికి లాక్ డౌన్ నేనున్నానంటూ వచ్చేసింది. రెక్కల కష్టానికి గండి కొట్టింది. తినటానికి తిండి లేకుండా పోయింది. దీంతో తన సొంత ఊరు వెళ్లిపోదామని పెళ్లాంబిడ్డల్ని వెంటేసుకుని ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా  900ల కిలోమీటర్లు కాలినడకనే బయలుదేరాడు వలస జీవి. 

పంజాబ్ నుంచి నడుస్తునే ఉన్నాడు. అలా మెడకు గాయం  అయినా 15 ఏళ్ల కొడుకు బ్రజేష్  కుమార్ ను మంచంపై పడుకోబెట్టి మోసుకెళుతు నడుస్తూనే ఉన్నాయి. అలా నడున్న అతడ్ని ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరులో రామ్ కుమార్ అనే పోలీసు అధికారి చూశాడు. అతనిని ఆపి మాట్లాడాడు.

తాను పంజాబ్ లోని లూథియానా కు వలస వెళ్లిన తనకు లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయానని అందుకే తన సొంత రాష్ట్రం అయిన మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ గ్రామానికి వెళ్తున్నానని చెప్పాడు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 900ల కిలోమీటర్లు అంత దూరం కొడుకుని మోసుకుంటు వెళ్తున్న అతన్నిచూసి చలించిపోయారు రామ్ కుమార్.  దీంతో వాళ్లు సురక్షితంగా వారి సొంత గ్రామానికి చేరుకోవటానికి ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ అధికారి రామ్ కుమార్. 

కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సానికి ఇప్పటికే ఎన్నో ప్రాణాలు బలైపోగా..బతకటానికి సగటు జీవి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఈ తరుణంలో ఇటువంటి దీనగాథలు ఎన్నె ఎన్నెన్నో.

Read: ఆ 2 డ్రగ్స్ కలిపి వాడితే…4 రోజుల్లోనే కోలుకున్న కరోనా పేషెంట్లు