Minister Gangula Kamalakar: మమ్మల్ని ఎన్నిరకాల ప్రశ్నలు వేసినా నిజం ఇదే.. సీబీఐ విచారణపై మంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు..

నా ఫోటోలు, కాల్ లిస్ట్ సీబీఐ అధికారుల దగ్గర ఉన్నాయి. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇద్దరం చెప్పింది ఒకటే ఉందని సీబీఐ అధికారులు చెప్పారు. నన్ను 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

Minister Gangula Kamalakar: మమ్మల్ని ఎన్నిరకాల ప్రశ్నలు వేసినా నిజం ఇదే.. సీబీఐ విచారణపై మంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు..

Minister Gangula

Minister Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ సీబీఐ విచారణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు ఇటీవల అరెస్టు చేశారని, తనకు నాకు ఎలాంటి పరిచయం లేదని మంత్రి తెలిపారు. మున్నూరు కాపు సంఘంలో తిరిగేవాడని, సంఘం పెద్దలు శ్రీనివాస్ ను తనకు పరిచయం చేశారని మంత్రి తెలిపారు. మున్నూరు కాపు కులంలో ఐపీఎస్ కదా అని గర్వంగా ఫీలయ్యామని చెప్పాను. అతని భార్య కూడా ఐఏఎస్ అన్నారు కదా ఆమెను కూడా కలవాలని చెప్పాను అని వివరించారు. ఆ రోజు అతనితో దిగిన ఫోటో అధికారుల వద్ద ఉందని, మరుసటి రోజు గంట సేపు మామూలుగా మాట్లాడింది తప్ప అంతకు మించి ఆయనతో నాకు పెద్దగా పరిచయంకూడా లేదని మంత్రి తెలిపారు.

Minister Gangula On ED Raids : ఇంటి తాళాలు పగలగొట్టాలని నేనే చెప్పా.. ఈడీ, ఐటీ దాడులపై మంత్రి గంగుల రియాక్షన్

నా ఫోటోలు, కాల్ లిస్ట్ సీబీఐ అధికారుల దగ్గర ఉన్నాయని, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని మంత్రి అన్నారు. ఇద్దరం చెప్పింది ఒకటే ఉందని సీబీఐ అధికారులు చెప్పారని మంత్రి తెలిపారు. నన్ను సీబీఐ అధికారులు 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని అన్నారు. ఇప్పటి వరకు శ్రీనివాస్ నన్ను ఎలాంటి పనులు అడగలేదు, నేను కూడా అతడిని ఏ పని అడగలేదని మంత్రి స్పష్టం చేశారు. కేవలం మా బావ, ఎంపి వద్ధి రాజు రవిచంద్రకి అతను పరిచయం. అయితే, శ్రీనివాస్ ఇంట్లో పెళ్లికి మా బావను సహాయం చేయమని అడిగారని తెలిసిందని, రూ.15 లక్షలు విలువ ఉద్దేర ఇప్పించాడు. అదే విషయాన్ని మొన్న చెప్పామన్నారు. ఆ డబ్బులు ఇంకా అలాగే బకాయి ఉందని సీబీఐ అధికారుల వద్ద చెప్పినట్లు మంత్రి వివరించారు.

Minister Gangula ED Raids: మంత్రి గంగుల ఇంట్లో ముగిసిన ఈడీ, ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మేము ఎవరిని కలవాల్సిన అవసరం లేదని, సీబీఐ అధికారులు మమ్మల్ని ఎన్నిరకాల ప్రశ్నలు వేసినా నిజం ఇదే అన్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఏరోజు ఎవరితో లావాదేవీలు జరపలేదని, కాబట్టి మాకు ఎవరికి అనుమానం రాలేదన్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అని చెప్పి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని విచారణలో తేలిందని మంత్రి గుంగుల అన్నారు.