Minister Harish Rao: ఢిల్లీలో అవార్డులిస్తారు.. గల్లీలో తిడుతారు.. ప్రజలు ఆలోచించి పనిచేసే వారిని ఆశీర్వదించాలి

మహారాష్ట్రలో తొమ్మిది రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ నీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఇన్వర్టర్లు లేవు, కన్వర్టర్లు లేవు, జనరేటర్లు లేవు. హైదరాబాద్‌లోనే కాదు, పల్లెల్లో కూడా 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌‌ది అని హరీష్‌రావు అన్నారు.

Minister Harish Rao: ఢిల్లీలో అవార్డులిస్తారు.. గల్లీలో తిడుతారు.. ప్రజలు ఆలోచించి పనిచేసే వారిని ఆశీర్వదించాలి

Minister Harish Rao

Minister Harish Rao: ప్రత్యేక తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ హైదరాబాద్ నీటి కష్టాలను తీర్చారని మంత్రి హరీష్ రావు అన్నారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 100 పడకల దవాకాన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రెండేళ్లు కష్ట పడి స్థానిక ఎమ్మెల్యే ఈ ఆసుపత్రి వచ్చేలా కృషి చేశారని అన్నారు. 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి వస్తుందని, పఠాన్ చెరు‌లో మరొక సూపర్ స్పెషాలిటీ వస్తుందని, ఇవిఉన్నా కూడా మీ ఎమ్మెల్యే పట్టుబట్టి ఆసుపత్రి సాధించారని హరీష్ రావు కొనియాడారు. కూకట్ పల్లిలో చెరువు బాగైంది, రైతు బజార్ బాగైందని అన్నారు. పి. జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నీళ్ళ‌కోసం నాడు ధర్నాలు చేశారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేవని గుర్తుచేశారు.

Gutta Sukhender Reddy : కాంగ్రెస్‌కు అధికారంఇస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరే.. ప్రజలు వాస్తవికంగా ఆలోచించాలి

మహారాష్ట్రలో తొమ్మిది రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ నీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్‌దే. ఇన్వర్టర్లు లేవు, కన్వర్టర్లు లేవు, జనరేటర్లు లేవు. హైదరాబాద్‌లోనే కాదు, పల్లెల్లో కూడా 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30శాతం ఉంటే, ఈ ఏడాది మే నెలలో అవి 70శాతంకు చేరాయని చెప్పారు. మన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. కష్ట‌పడి పని‌చేస్తేనే ఇదంతా సాధ్యం అయ్యిందని అన్నారు. నాడు 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ పెట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొమ్మిదేళ్లలో 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని హరీష్ రావు గుర్తు చేశారు.

Talangana BJP : తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు, అస్సాంలో సీఎం హిమంత బిశ్వశర్మతో ఈటల చర్చలు..

వైద్య విద్యకోసం ఉక్రెయిన్, చైనా వెళ్లాల్సిన పరిస్థితి గతంలో ఉండేదని, డాక్టర్ల కొరత ఎక్కువగా ఉండేదని, నాడు ఎంబీబీఎస్ సీట్లు 2950 ఉంటే నేడు 8340 సీట్లు ఉన్నాయని, పక్కా తెలంగాణలో ఉండి మన బిడ్డలు డాక్టర్ కావొచ్చునని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ వాళ్ళు మేమే ఇచ్చినం మెడికల్ కాలేజీలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక్కో మెడికల్ కాలేజీ మీద తెలంగాణ 500 కోట్లు ఖర్చు చేస్తున్నది. NMC అటానమస్ బాడీ అనుమతి ఇస్తుంది. జుటా ప్రచారం బీజేపీది. ఇంత దారుణం ఉండదు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు ఉంది అంటూ హరీష్‌రావు ఘాటుగా విమర్శించారు. 157 మెడికల్ కాలేజీలుఇస్తే తెలంగాణకు ఒక్కటి‌కూడా ఇవ్వలేదని అన్నారు.

Producer Bellamkonda Suresh: బెల్లంకొండ కారులో చోరీ.. మద్యం సీసాలు మాయం.. ఒక్కో సీసా ఖరీదు ఎంతో తెలుసా?

జూన్ 14 నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేయబోతున్నాం. ఎవరు అడగక ముందే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. పుట్టుక నుండి చావుదాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది. కేంద్రంలోని పెద్దలకు ఇవ్వన్నీ తెలుసు. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలుసు. ఢిల్లీలో అవార్డులు ఇస్తారు. కానీ, గల్లీలో తిడుతరు. ప్రజలు ఆలోచించాలి. పనిచేసే వారిని ఆశీర్వదించాలని మంత్రి హరీష్ రావు కోరారు.