AP, TS Water Issue : జల వివాదం..హక్కుల కోసం దేవుడితో కూడా కొట్లాడుతాం – కేటీఆర్

చట్టప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల దేవుడితోనైనా కొట్లాడుతామని, పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ అన్యాయం జరగనివ్వరని హామీనిచ్చారు.

AP, TS Water Issue : జల వివాదం..హక్కుల కోసం దేవుడితో కూడా కొట్లాడుతాం – కేటీఆర్

Ktr

Minister KTR : కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది. దీనిపై ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో..రాజీ పడేది లేదని మంత్రి కేటీఆర్ కుండబద్ధలు కొట్టారు.

చట్టప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించుకుంటామని స్పష్టం చేశారాయన. తెలంగాణ రాష్ట్ర హక్కుల దేవుడితోనైనా కొట్లాడుతామని, పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ అన్యాయం జరగనివ్వరని హామీనిచ్చారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు..శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. పాలమూరులో ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణ పథకాలు ఒక్కటైనా కర్నాటక రాష్ట్రంలో అమలు అవుతున్నాయా అని సూటిగా ప్రశ్నించారు.

గత కొన్ని రోజులుగా కృష్ణా నది జలాల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాటం చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.