Telangana Assembly : దేశానికి కేసీఆర్ లాంటి డబుల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి : కేటీఆర్

దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి అంటూ బీజేపీ నేతలు చెబుతుంటారు. డబులు ఇంజన్ సర్కార్ ఏం చేసింది అన్నింటి ధరలు పెంచుడు తప్ప అంటూ అసెంబ్లీ సమావేశాల్లో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. దేశానికి కావాల్సింది కేసీఆర్ లాంటి డబుల్ ఇంపాక్ట్ సర్కార్ అని అన్నారు.

Telangana Assembly : దేశానికి కేసీఆర్ లాంటి డబుల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి : కేటీఆర్

Minister KTR criticizes PM Modi's government

Telangana Assembly : దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి అంటూ బీజేపీ నేతలు చెబుతుంటారు. డబులు ఇంజన్ సర్కార్ ఏం చేసింది అన్నింటి ధరలు పెంచుడు తప్ప అంటూ అసెంబ్లీ సమావేశాల్లో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. దేశానికి కావాల్సింది కేసీఆర్ లాంటి డబుల్ ఇంపాక్ట్ సర్కార్ అని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలంగాణ దేశానికే ఆదర్శవంతంగా మారిందన్నారు. అటువంటి తెలంగాణ కేంద్రానికి ట్యాక్సుల రూపంలో కట్టేది ఎక్కువ కేంద్రం నుంచి తెలంగాణకు ఇచ్చేది తక్కువ అంటూ విమర్శలు సంధించారు కేటీఆర్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్బంగా కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. మోడీ ప్రభుత్వ హయాంలో అన్నింటి ధరలు భారీగా పెరిగాయనీ.. కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరణ చేయటానికి యత్నిస్తోందని..సింగరేణికి నాలుగు గనులు కేటాయించాలని సీఎం కేసీఆర్ లేఖ రాస్తే ఇవ్వకుండా వేలం పెడతామని చెబుతోందన్నారు.

30 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం మోడీ ప్రభుత్వ హయంలోనే నమోదు అయ్యిందన్నారు. ద్రవోల్బణమే కాదు 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో నిరుద్యోగ సమస్య పెరిగిందని లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి వాటిని నెరవేర్చని ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అంటూ విమర్శించారు. ఇక వంట గ్యాస్ విషయాన్నికి వస్తే మహిళలకు అత్యంత భారంగా మారిందని ఇది ఏ స్థాయిలో పెరిగిందంటే ప్రపంచంలోనే హైయెస్ట్‌ సిలిండర్‌ ధర భారత్ ఉందని తెలిపారు. రూ.4 నాలుగు వందల సిలిండర్‌ ధరను 12వందలు చేసిన ఘతన మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని మహిళలకు ప్రధాని మోడీ ఇచ్చిన అత్యంత విలువైన కానుక ఇది అని ఎద్దేవా చేశారు.

అంతేకాదు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని వీడి భూమ్మీదకు రానంటున్నాయి ప్రపంచలోనే అత్యంత ఎక్కువ పెట్రోలు ధర కలిగిన మూడో దేశం భారతే అని..ఇలా ప్రధాని మోడీ హయంలో చేసిన ఘనతలు అన్నీ ఇన్నీ కావన్నారు. సామాన్యుడు బతకలేని స్థితికి దేశాన్ని తీసుకున్నారని పైగా అమలు కాని హామీలు ఇంకా చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్ని మోడీ హామీ ఎక్కడికెళ్లిందంటూ ప్రశ్నించారు. 2022కల్లా దేశంలోని ప్రతి ఇంటికి కరెంటు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఈ కంప్యూటర్ యుగంలో కూడా విద్యుత్ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని ఈ చీకట్లు మోడీకి కనిపించవా? అంటూ ప్రశ్నించారు. భారతదేశం నుంచి అంతరిక్షంలో అస్ట్రోనాట్లను పంపుతామని మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేటీఆర్‌ ప్రశ్నించారు.