Minister KTR : 70ఏళ్లలో జరగని పనులు 7ఏళ్లలో జరిగాయి-కేటీఆర్

తెలంగాణ బిడ్డలకి బువ్వ పెట్టుడు కాదు ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ గర్వంగా చెప్పారు.(Minister KTR)

Minister KTR : 70ఏళ్లలో జరగని పనులు 7ఏళ్లలో జరిగాయి-కేటీఆర్

KTR

Minister KTR : పార్టీ లేకపోతే, కార్యకర్తలు లేకపోతే పదవులు లేవు అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. పదిరా గ్రామంలో ముగ్గురు కలిసి దళితబంధు సాయంతో బ్యాంక్ లోన్ తీసుకుని రూ.3కోట్లతో రైస్ మిల్ ప్రారంభించారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ బిడ్డలకి బువ్వ పెట్టుడు కాదు ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ గర్వంగా చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

పదవులు వస్తాయి, పోతాయి అన్న కేటీఆర్.. పదవి ఉన్నపుడు గల్లా ఎగరేసి చేసిన పని చెప్పుకునే ఘనత మీకే ఉన్నది అని అన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో పోటీ పడి పని చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని కేంద్రం లిస్ట్ తీస్తే.. 19 మన దగ్గరే ఉన్నాయన్నారు కేటీఆర్. 27 మున్సిపాలిటీలకు అభివృద్ధి అవార్డులు వచ్చాయన్నారు.(Minister KTR)

Also Read..Minister KTR: భారతదేశం చూస్తోంది..! బీజేపీపై ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డ కేటీఆర్, కవిత ..

మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం అయిన సిరిసిల్ల.. నేడు కోనసీమలా మారిందన్నారు. 70ఏళ్లలో జరగని పనులు ఈ 7ఏళ్లలో జరిగాయన్నారు. 2023లో 100 సీట్లు ఎలా రావో చూద్దాం అన్నారు సీఎం కేసీఆర్.

Also Read..MLA Jagga Reddy : అద్వానీ ప్రధాని కాకుండా మోడీ కుట్రలు చేశారు- ఎమ్మెల్యే జగ్గారెడ్డి

”గత పాలకుల హయాంలో 50ఏళ్లలో జరగని అభివృద్ధి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఈ 8ఏళ్లలో చేసి చూపాము. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత మా ప్రభుత్వానికి దక్కింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి ఇలా ఏదో ఒక పథకంలో లబ్ధి జరిగింది.

ముసలవ్వలను అడగాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత పెన్షన్ వచ్చిందని ప్రస్తుతం కేసీఆర్ పాలనలో ఎంత వస్తుందని. గతంలో రూ.200 ఇచ్చే పెన్షన్ ను రూ.2,016కు పెంచిన ఘనత కేసీఆర్ కి దక్కింది. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మాటలు చెబుతారు కానీ పనులు చేయరు. మా నాయకుడు కేసీఆర్ పనిచేసే నాయకుడు” అన్నారు కేటీఆర్.