MLC Kavitha : తెలంగాణలో కరోనా పంజా, హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు..ఎమ్మెల్సీ కవిత ట్వీట్

కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

MLC Kavitha : తెలంగాణలో కరోనా పంజా, హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు..ఎమ్మెల్సీ కవిత ట్వీట్

Help Line

Covid 19 Patients : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా పంజా విసురుతోంది. వందల సంఖ్యలో ఉన్న కేసులు ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరుతున్నాయి. మూడు వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా సోకిన తర్వాత..ఏం చేయాలో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొంతమందికి తెలియదు. ఈ క్రమంలో..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా గణనీయంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. హైదరాబాద్ కార్యాలయంలో 040-23599999 / 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 ద్వారా కరోనా విషయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రజల నుండి నిరంతరం ఫోన్ కాల్స్, మెస్సేజ్ లు వస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఫోన్ నంబర్ల ఏర్పాటు చేశామని కవిత తన ట్వీట్‌లో వెల్లడించారు.

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రజలు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వాలు, అధికారులు నెత్తీ నోరు మొత్తుకుని చెబుతున్నారు. అయినా కూడా… జనం ఈ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు. దీంతో.. పరిస్థితి చేయి దాటే స్టేజ్‌కు వచ్చింది. వైరస్‌ రోజు రోజుకు ఉధృతమవుతోందని తెలిసినా జనం మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

షరా మామూలుగానే రోడ్డెక్కేస్తున్నారు. అయితే.. అలాంటి వారి తాట తీస్తున్నారు పోలీసులు. బహిరంగంగా మాస్కు లేకుండా కనిపిస్తే వేయి రూపాయల జరిమానా విధిస్తున్నారు. వేర్వేరు చోట్ల స్పెష‌ల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ… మాస్కులు ధ‌రించ‌కుండా క‌రోనా నిబం‌ధ‌న‌లు ఉల్లంఘిస్తున్న వారికి జ‌రిమానాలు విధిస్తున్నారు. ఈ చలానాలు ఇంటికే పంపిస్తున్నారు.