MP Laxman: అందుకే కేసీఆర్, కేజ్రీవాల్ కలిశారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

నీతి ఆయోగ్, పార్లమెంటు ప్రారంభోత్సవానికి హాజరుకాని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని లక్ష్మణ్ అన్నారు.

MP Laxman: అందుకే కేసీఆర్, కేజ్రీవాల్ కలిశారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman

MP Laxman – New Parliament: తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమావేశాలు అవుతుండడం వెనుక లిక్కర్ కేసు ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నదులకు నడక నేర్పాడో లేదో కానీ మద్యానికి పరుగులు నేర్పారు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు.

కొత్త పార్లమెంట్ గురించి కూడా లక్ష్మణ్ స్పందించారు. దేశ చరిత్రలో నూతన పార్లమెంట్ ఒక మైలు రాయిగా నిలుస్తుందని అన్నారు. భారతీయత ఉట్టి పడేలా పార్లమెంట్ నిర్మాణం ఉందని చెప్పారు. సెంగల్ పార్లమెంట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. కేసీఆర్, నీతి ఆయోగ్ సమావేశానికి, పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని గుర్తు చేశారు.

నీతి ఆయోగ్, పార్లమెంటు ప్రారంభోత్సవానికి హాజరుకాని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ప్రధానిని, గవర్నర్లను అవమాన పరిచేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ కు అడుగులకు మడుగులు ఒత్తేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు.

ప్రధాని మోదీకి దేశంలో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని చెప్పారు. రాజకీయం కోసమే రాష్ట్రపతి అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పోటీ చేస్తే వీళ్లంతా వ్యతిరేకించారని చెప్పారు. మోదీని విమర్శించేందుకు ఇప్పుడు ఒక్కటి అవుతున్నారని అన్నారు. ఆర్జేడీ తమ స్థాయి మర్చి మాట్లాడుతోందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయాన్ని శవపేటికతో పోల్చడం సరికాదని చెప్పారు.

Rajini – Shah Rukh : కొత్త పార్లమెంట్‌ పై రజినీ, షారుఖ్‌ ట్వీట్‌.. రిప్లై ఇచ్చిన ప్రధాని మోదీ!