Munugode By Poll : కోమటిరెడ్డి టార్గెట్‌గా.. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారాస్త్రంగా మారిన రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్..

మునుగోడులో మరో మూడు వారాల్లో ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో మునుగోడు కేంద్రంగా ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాట తూటాలు పేలుతున్నాయి. ఛాలెంజ్ లు జరుగుతున్నాయి. పోటాపోటీగా విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మునుగోడు రాజకీయమంతా 18 వేల కోట్ల కాంట్రాక్ట్ చుట్టే.. తిరుగుతోంది. దీంతో..మునుగోడు బైపోల్ హాట్ హాట్‌గా మారింది.

Munugode By Poll : కోమటిరెడ్డి టార్గెట్‌గా.. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారాస్త్రంగా మారిన రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్..

Munugode By Poll

Munugode By Poll : మునుగోడులో మరో మూడు వారాల్లో ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో మునుగోడు కేంద్రంగా ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాట తూటాలు పేలుతున్నాయి. ఛాలెంజ్ లు జరుగుతున్నాయి. పోటాపోటీగా విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మునుగోడు రాజకీయమంతా 18 వేల కోట్ల కాంట్రాక్ట్ చుట్టే.. తిరుగుతోంది. దీంతో..మునుగోడు బైపోల్ హాట్ హాట్‌గా మారింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి మునుగోడు ఎన్నికల బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్‌గా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ సీరియస్ పొలిటికల్ గేమ్ మొదలుపెట్టాయి. రాజగోపాల్ రెడ్డికి.. బీజేపీ ప్రభుత్వం 18 వేల కోట్ల కాంటాక్ట్ర్ ఇచ్చిందనే అంశాన్నే.. ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. దీనిపై.. సవాళ్లు, ప్రతి సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. దీంతో.. రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.

కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇంకెంతో సమయం కూడా లేదు. మూడు వారాల్లోనే.. మునుగోడు పోలింగ్ జరుగనుంది. దీంతో మునుగోడులో మరింత హీట్ కనిపిస్తోంది. ఇప్పటిదాకా తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో.. కేవలం రెండు పార్టీల మధ్యే టగ్ ఆఫ్ వార్ నడిచింది. కానీ.. మునుగోడుకు వచ్చేసరికి మొత్తం పొలిటికల్ సినారియోనే మారిపోయింది. ఈ ఉపఎన్నికలో.. ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. అయితే.. కాంగ్రెస్, టీఆర్ఎస్.. లేకపోతే.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే గట్టి పోటీని చూశాం. కానీ.. మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ లక్ష్యం.. బీజేపీని ఓడించడమే. సిట్టింగ్ సీటులో.. రాజగోపాల్ రెడ్డికి షాకివ్వడమే. ఇందుకోసం.. గట్టిగా ట్రై చేస్తున్నాయ్. ముఖ్యంగా.. మునుగోడు బైపోల్ అంతా 18 వేల కోట్ల కాంట్రాక్ట్ చుట్టూనే తిరుగుతోంది. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కేంద్రం నుంచి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నాకే.. ఆయన కాంగ్రెస్‌ను వీడారని.. ఆ తర్వాత బీజేపీలో చేరారని.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయ్. పైగా ఈ ఉప ఎన్నికలోనూ.. 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌నే రెండు పార్టీలు హైలైట్ చేస్తున్నాయ్. ఆ ఒక్క పాయింట్‌ని పట్టుకొని.. దానినే ప్రచారాస్త్రంగా మలచుకున్నాయ్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

18 వేల కోట్ల కాంట్రాక్ట్ విషయంలో టీఆర్ఎస్ అయితే ఏకంగా సవాళ్లే విసురుతోంది. మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినట్లే.. నల్గొండ అభివృద్ధికి 18 వేల కోట్లు బీజేపీ ఇస్తే.. టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందని చెబుతున్నారు. ఓ కాంట్రాక్టర్ బలుపు, అహంకారం వల్లే.. మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. మిషన్ భగీరథకు 19 వేల కోట్లు ఇవ్వలేదు గానీ.. కోమటిరెడ్డికి మాత్రం 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. మునుగోడులో.. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఎన్నిక జరుగుతోందన్నారు. మోడీ, బోడీ, ఈడీ.. తమ వెంట్రుక కూడా పీకలేరని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు.. మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. రాజగోపాల్ రెడ్డికి.. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం కాదు.. నల్గొండ జిల్లాకు 18 వేల కోట్లు కేటాయిస్తే.. ఉపఎన్నిక బరి నుంచి తప్పుకుంటామన్నారు.కాంగ్రెస్ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే టార్గెట్ చేసింది. టీఆర్ఎస్ 18 వేల కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకున్నారని విమర్శిస్తుంటే.. కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి.. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకున్నారని విరుచుకుపడుతోంది. 23 వేల ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డిని గెలిపిస్తే.. 22 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను తెచ్చుకున్నాడని.. రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న విమర్శలను.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తిప్పికొడుతున్నారు. కాంట్రాక్టుల కోసమే తాను బీజేపీలో చేరినట్లు వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. తాను డబ్బు కోసం అమ్ముడుపోయే వ్యక్తి కాదని.. బీజేపీతో లబ్ధి జరగలేదని యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేస్తానన్నారు. తప్పు చేశానని నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. అలాంటిదేమీ లేదని తేలితే టీఆర్ఎస్ నేతలు పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.అయితే.. కోమటిరెడ్డి కామెంట్స్‌కి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నుంచి అప్పనంగా వేల కోట్ల కాంట్రాక్టులు పొందలేదని.. చార్మినార్ ఆలయం దగ్గర బండి సంజయ్‌పై ప్రమాణం చేయాలని.. లేకపోతే యాదాద్రిలో మోదీ మీద ఒట్టేసి చెప్పాలని సవాల్ విసిరారు కేటీఆర్.

అంతేకాదు.. బీజేపీ అప్పనంగా ఇచ్చిన 18 వేల కోట్ల కాంట్రాక్ట్ వదులుకొని.. కోమటిరెడ్డి పోటీ చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు.. రాజగోపాల్ రెడ్డి ఫోటోలతో.. మునుగోడులో కాంట్రాక్ట్ పే అనే పోస్టర్లు కూడా వెలిశాయి. ఇవి ఇప్పుడు.. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. మునుగోడులో.. 5 వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోందని.. టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ ఇచ్చిన వేల కోట్ల కాంట్రాక్ట్ కమీషన్‌తోనే.. బైకులు, కార్లతో పాటు ఇతర విలువైన వస్తువులతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. మొత్తంగా.. మునుగోడు బైపోల్ మొత్తం 18 వేల కోట్ల కాంట్రాక్ట్ చుట్టే తిరుగుతోంది. ఇది.. బీజేపీ, రాజగోపాల్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుంది? ఈ ప్రచార అస్త్రం.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఎవరికి ప్లస్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.