KTR Ration Cards : గుడ్ న్యూస్.. జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు
కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.

Minister KTR On Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆసరా పెన్షన్లు 10 రెట్లు పెంచామన్న కేటీఆర్.. 57ఏళ్లు నిండిన వారికి త్వరలోనే పెన్షన్లు ఇస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్ని పెండింగ్ లో ఉన్న 4.50లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని జూన్ 8న సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేటలో 4వ విడత పల్లె ప్రగతిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను ఏడేళ్లలో చేసి చూపించామని
కేటీఆర్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మానేరు నిండిందన్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. స్వరాష్ట్రం వచ్చాకే చెరువులు బాగు పడ్డాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాకే 24 గంటల కరెంట్ వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 12వేల 769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు స్ఫూర్తితో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చారని కేటీఆర్ అన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ విలువ అందరికీ తెలిసిందన్న కేటీఆర్.. ఊరంతా మొక్కలు నాటి పెంచాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సూచించారు. దేశంలోఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అన్నారు. రాష్ట్రంలో 40లక్షల మందికి పింఛన్ వస్తుందని కేటీఆర్ తెలిపారు.
- Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
- 10th Exams : నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్..ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- Cars Collided: అంబులెన్సుకు దారి ఇస్తూ 7 కార్లు ఢీ
- Heavy Rains: చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వానలు
- Minister Harish Rao : పెట్రోల్ పై పెంచింది బారాణా..తగ్గించింది చారాణా : మంత్రి హరీష్ రావు
1F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!
2Madhya Pradesh : తోపుడు బండిపై భిక్షాటన కష్టంగా ఉందని మోపెడ్ కొనుక్కున్న యాచక దంపతులు
3WARTS : పులిపిర్లు ఎందుకొస్తాయ్! నివారణ ఎలాగంటే?
4Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
5IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే
6Vikram: రన్‌టైమ్ లాక్ చేసిన విక్రమ్.. ఎంతంటే?
7Antarctica ice : అంటార్కిటికాలో గ్లోబల్ వార్మింగ్‌ను తట్టుకొని పెరిగిన ఐస్ షెల్ఫ్‌లు
8Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!
9Gurugram: వాతావరణం అనుకూలించలేదు.. ప్రైవేట్ కంపెనీలన్నింటికీ వర్క్ ఫ్రమ్ హోమ్
10BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి
-
Viral Video : టొరంటోలో తుఫాన్ బీభత్సం.. రాకాసి గాలులకు కొట్టుకుపోయిన ట్రాంపోలిన్
-
Chardam Vicinity Plastic : చార్దామ్ యాత్రలో ప్లాస్టిక్‌తో ముప్పు
-
Saudi Arabia : అంతర్జాతీయ ప్రయాణికులపై సౌదీ ఆంక్షలు..ఆ దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్
-
NHAI JOBS : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
-
Australia : ఆస్ట్రేలియాలో అండర్‌వేర్‌తో వచ్చి ఓటు వేసిన ఓటర్లు
-
Modi Japan Tour : హిందీలో పలకరించిన జపాన్ కిడ్స్.. వావ్ అంటూ మోదీ ఫిదా.. వీడియో వైరల్..!
-
Pakistan ISI : భారత్‌లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర
-
Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్