Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్

మంగళవారం ఢిల్లీలో 10టీవీ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన కోచ్ భాస్కర్ భట్..మున్ముందు భారత్ తరుపున నిఖత్ జరీన్ పాల్గొననున్న వేదికల గురించి చెప్పారు

Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్

Bhaskar

Nikhat Zareen: ప్రపంచ మహిళా బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించింది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్. ప్రపంచ బాక్సింగ్ వేదికపై భారత సత్తా ఏంటో మరోసారి సాటిచెప్పింది. జూనియర్ బాక్సింగ్ లోనూ ఛాంపియన్ గా నిలిచిన జరీన్..రానున్న రోజుల్లో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా కఠోర సాధన చేస్తుంది. ప్రపంచ బాక్సింగ్ లో నిఖత్ జరీన్ బంగారు పథకం సాధించడంపై జరీన్ కోచ్..భాస్కర్ భట్ అనడం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో 10టీవీ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన కోచ్ భాస్కర్ భట్..మున్ముందు భారత్ తరుపున నిఖత్ జరీన్ పాల్గొననున్న వేదికల గురించి చెప్పారు. వరల్డ్ బాక్సింగ్ పోటీలలో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ విజయం వెనుక ఆమె 14 ఏళ్ల శ్రమ ఉందని భాస్కర్ భట్ అన్నారు. మానసికంగా, సాంకేతికంగా ఆటలో జారిన చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ప్రతిరోజు గంటలకొద్దీ సాధన ఆమె చేసిందని భట్ చెప్పారు.

Other Stories:Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు

తన మతంతో సంబంధం లేకుండా ఒక బాక్సర్ గా మాత్రమే నిఖత్ ఫోకస్ చేసిందని కోచ్ భట్ చెప్పారు. ఆమెకు ఆమె కుటుంబానికి ఆటపై పూర్తి నిబద్ధత ఉందని ఆయన తెలిపారు. మా తదుపరి లక్ష్యం భారత్ తరుపున కామన్వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్ లో పాల్గొనడమేనని..ఆతర్వాతే ఒలింపిక్స్ పై ఫోకస్ పెట్టనున్నట్లు కోచ్ భాస్కర్ భట్ వివరించారు. ఒలింపిక్స్ లో గెలవడానికి నికత్ కు పూర్తి సత్తా ఉందన్న భట్..అందుకు శ్రమ, పట్టుదల, ఓర్పు అవసరమని అన్నారు. మహిళా బాక్సర్లకు కేంద్ర రాష్ట్రాలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా..బాక్సింగ్ అసోసియేషన్ మద్దతుగా ఉన్నాయని భాస్కర్ భట్ తెలిపారు. ఒలింపిక్స్ లో విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు భాస్కర్ భట్. అందరు క్రీడాకారులు నిబద్ధతతో ఆడితే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారని ఆయన అన్నారు.