BJP : వరి కొనుగోళ్లు.. నిరసనలకు బీజేపీ పిలుపు

వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ నిరసనలు, ధర్నాలకు..

BJP : వరి కొనుగోళ్లు.. నిరసనలకు బీజేపీ పిలుపు

Bjp

BJP : వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చాయి. కేంద్రం.. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే టీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పోటీగా బీజేపీ కూడా నిరసనలకు రెడీ అయ్యింది.

గురువారం అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకు ఆందోళనలు చేయాలని నిర్ణయించామని బీజేపీ నేతలు తెలిపారు. పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులను భయబ్రాంతులకు గురి చేయకుండా కనీస మద్దతు ధర ఇవ్వాలని బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండి ధర్నాలు చేయాలని చూస్తున్నారని టీఆర్ఎస్ పై మండిపడ్డారు. ముందు వర్షా కాలంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఆ తర్వాతే యాసంగి పంట గురించి ఆలోచన చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు.

Heart Disease : చలికాలంలోనే గుండె జబ్బులు అధికం ఎందుకంటే?..

మరోవైపు వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకోవడానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా కేంద్రంపై యాక్షన్ ప్లాన్ ప్రక‌టించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకుంటామన్నారు. వరి ధాన్యాన్ని కేంద్రం కొనాల‌ని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో రైతులతో కలిసి ధ‌ర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు. ధర్నాలకు రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్రం వ‌డ్లు కొంటుందా? కొన‌దా? అనేది తేలిపోవాలని కేసీఆర్ అన్నారు. వరి కొనుగోళ్ల విషయంలో చిత్తశుద్ధి ఉంటే.. శుక్రవారం జరిగే ధర్నాలో తమతో క‌లిసి కూర్చోవాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి సవాల్‌ చేశారు కేసీఆర్.

Pickle : నిల్వ పచ్చళ్ళతో ఆరోగ్యానికి ప్రమాదమా..?

బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించినా.. ధాన్యం కొంటారో, లేదో నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇకపై కేంద్రాన్ని వదిలిపెట్టమని.. వెంటాడతాం, వేటాడతాం.. ఎక్కడిదాకా అయినా పోతామని కేసీఆర్ స్పష్టం చేశారు. పంజాబ్‌లో ధాన్యం కొంటున్నట్లు.. తెలంగాణలో కొంటారో, లేదో తేల్చి చెప్పాలన్నారు. మిల్లర్లు, వ్యాపారుస్తుల నుంచి హామీ ఉన్న రైతులు, ఒక రూపాయి తక్కువకైనా అమ్ముకుంటాం అనుకున్న వారు వరి పంట వేసుకోవచ్చన్నారు.