గాంధీలో ప్లాస్మా థెరపీతో కోలుకున్న కరోనా రోగి

  • Published By: srihari ,Published On : June 1, 2020 / 06:14 AM IST
గాంధీలో ప్లాస్మా థెరపీతో కోలుకున్న కరోనా రోగి

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి ప్లాస్మా థెరపీతో గాంధీ ఆస్పత్రి వైద్యులు చెక్ పెట్టారు. హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో ప్లాస్మా థెరపీ సక్సెస్ అయింది. ప్రాణపాయ స్థితిలో వెంటలేటర్ పై ఉన్న కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు. కోవిడ్ 19కు కేంద్రమైన గాంధీలో ప్లాస్మా థెరపీ నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ గత నెలలో అనుమతి ఇచ్చింది. గాంధీలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఆరుగురు బాధితుల కేస్ షీట్లతోపాటు పూర్తి వివరాలను ఐసీఎమ్మార్ కు పంపించారు.

ముందుగా థెరపీ చికిత్స కోసం ఒకరిని సెలెక్ట్ చేసింది. ఐసీఎమ్మార్ నిపుణుల సూచనలతో మే 14న చావు బతుకుల మధ్య వెంటిలేటర్ పై ఉన్న పాతబస్తీకి చెందిన 44 ఏళ్ల వ్యక్తికి 200 ఎంఎల్ ప్లాస్మా ద్రవనాన్ని ఎక్కించారు. అతని ఆరోగ్యం మెరుగుపడటంతో రెండు రోజుల తర్వాత మరో 200 ఎంఎల్ ప్లాస్మా ఎక్కించారు. బాధితుడు పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత మరో వారం రోజులపాటు అబ్బర్వేషన్ లో ఉంచారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు. 

తెలంగాణలో ప్లాస్మా థెరపీ మొదలైంది. ఇప్పటికీ ముగ్గురికి ప్లాస్మా థెరపీ చికిత్స ప్రారంభించడంతో సక్సెస్ అయింది. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గత మే నెలలో ఐసీఎమ్మార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గాంధీలో ఉన్న డాక్టర్లు దీనిపై నిపుణుల కమిటీ వేశారు. 

ఎవరైకైతే ప్లాస్మా ఎక్కించాలో దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఐసీఎమ్మార్ కు పంపించడంతో అక్కడి నుంచి ఆరుగురికి సంబంధించిన పూర్తి వివరాలను ఐసీఎమ్మార్ కు సమర్పించింది. అందులో ముగ్గురికి ఐసీఎమ్మార్ గైడ్ లైన్స్ ప్రకారం 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ప్లాస్మా డోనర్ల నుంచి తీసుకునే వారికి కంప్లీట్ గా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. గాంధీలో ఇప్పటికే ప్లాస్మా థెరపీ చికిత్స అందించారు. 

పూర్తిస్థాయిలో పాజిటివ్ నుంచి నెగెటివ్ గా మారిన తర్వాత పరీక్షలు చేసి అతన్ని సక్సెస్ ఫుల్ గా డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత మరో మూడు రోజులకు ఐసీఎమ్మార్ ఆదేశాల మేరకు మరో ఇద్దరికి కూడా ప్లాస్మా ఎక్కించారు. దీంతో వారికి కూడా సక్సెస్ అయిన తర్వాత ఇద్దరిని కూడా డిశ్చార్జ్ చేశారు.

మొత్తానికి ఐసీఎమ్మార్ కు ఇప్పటికే ఆరుగురు పాజిటివ్ వ్యక్తులకు సంబంధించిన వివరాలను ఐసీఎమ్మార్ కు పంపించారు. అందులో ముగ్గురికి సక్సెస్ ఫుల్ గా కరోనా నుంచి కోలుకుని ఇళ్లలకు చేరుకున్నారు. కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ గానీ ఎలాంటి ఔషధం గానీ లేకపోవడంతో భయాందోళనలో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవాలి.

ఎందుకంటే రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేవలం మే నెలలో 1012 కేసులు పాజిటివ్ హైదరాబాద్ లో నమోదు అయ్యాయి. దీంతో అలర్జ్ అయిన అన్ని కంటైన్ మెంట్ జోన్లలోని 30 సర్కిళ్లలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమేరకు కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, నిత్యవసర సరుకులు అమ్మే దుకాణాల దగ్గర కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

తాజాగా 13 మంది కానిస్టేబుల్ కు పాజిటివ్ రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సెకండ్ స్టేజ్ లోకి ఉన్నప్పటికీ థర్డ్ స్టేజ్ కు వెళ్లడానికి చాలా ఎక్కువ అవకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్మా ట్రీమ్ మెంట్ సక్సెస్ కావడం కొంత ఊరట ఇస్తుందని చెప్పవచ్చు. 

గాంధీలో ఇప్పటివరకు ఉన్న కేసుల్లో 30 నుంచి 40 వరకు క్రిటికల్ కండీషన్ లో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వారిలో ఎవరికి ప్లాస్మా అవసరముంటుందో వారి వివరాలను ఐసీఎమ్మార్ పంపేందుకు సిద్ధమైనట్లు, నిపుణుల కమిటీ లిస్టును సిద్ధం చేసినట్లుగా సమాచారం.

ఐసీఎమ్మార్ నుంచి అనుమతి లభిస్తే వీరికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది సక్సెస్ అయితే గాంధీలో కరోనా సోకిన వారిని కాపాడుకునే అవకాశం ఉంది.