MLA Raja Singh: రాజాసింగ్‌కు మళ్ళీ 2 షోకాజ్ నోటీసులు ఇచ్చిన పోలీసులు

రాజాసింగ్ ఫేస్‌ బుక్‌ లో ఓ పోస్టుకు కామెంట్ చేశారు. దీంతో హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించి, ఓ సామాజికవర్గంపై కామెంట్‌ చేశారని మంగళ్ హాట్ పోలీసులు రెండు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో ఆయన వివరణ ఇవ్వాలని చెప్పారు. రాజా సింగ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. దీనిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలని రాజా సింగ్ ను పోలీసులు ఆదేశించారు.

MLA Raja Singh: రాజాసింగ్‌కు మళ్ళీ 2 షోకాజ్ నోటీసులు ఇచ్చిన పోలీసులు

MLA Raja Singh: హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్ హాట్ పోలీసులు మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్‌కు తెలంగాణ హైకోర్టు దాదాపు నెల రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన 3 నెలల పాటు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయకూడదని, మీడియా, సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదని ఆ సందర్భంగా ఆదేశించింది.

తాజాగా రాజాసింగ్ ఫేస్‌ బుక్‌ లో ఓ పోస్టుకు కామెంట్ చేశారు. దీంతో హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించి, ఓ సామాజికవర్గంపై కామెంట్‌ చేశారని మంగళ్ హాట్ పోలీసులు రెండు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో ఆయన వివరణ ఇవ్వాలని చెప్పారు. రాజా సింగ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు.

దీనిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలని రాజా సింగ్ ను పోలీసులు ఆదేశించారు. కాగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 25న పీడీ యాక్ట్ నమోదుచేయడంతో రాజా సింగ్ జైలుకి వెళ్లారు. అయితే, ఆయనను విడుదల చేయాలని నవంబరు 9న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆయనపై పీడీ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు అప్పట్లో పేర్కొంది.

Viral Video: రాహుల్‌కి బీజేపీ జెండాలు చూపిన యువకులు.. వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్