Secunderabad Violence Pruthvi : నా కుమారుడు బోగీలకు నిప్పు పెడతాడని ఊహించలేదు- పృథ్వీ తల్లిదండ్రులు

రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో తమ కుమారుడు ఉన్నట్లు తమకు తెలియదన్నారు. తమ కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. సాయి డిఫెన్స్ అకాడమీ వాళ్లే తీసుకెళ్లి ఉంటారని..(Secunderabad Violence Pruthvi)

Secunderabad Violence Pruthvi : నా కుమారుడు బోగీలకు నిప్పు పెడతాడని ఊహించలేదు- పృథ్వీ తల్లిదండ్రులు

Secuderabad Violence Pruthvi

Secunderabad Violence Pruthvi : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. రైల్వే స్టేషన్ లో ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టింది ఆదిలాబాద్ కు చెందిన పృథ్వీగా తేల్చారు పోలీసులు. ఆ తర్వాత విధ్వంసం వీడియోలను అతడు గ్రూప్ లో షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో ఏ12గా ఉన్న పృథ్వీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు పృథ్వీతో పాటు పోలీసుల అదుపులో మరో 9మంది ఉన్నారు.

Secunderabad Fire Case : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. బోగీలకు నిప్పు పెట్టింది వీళ్లే.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు

పృథ్వీ అరెస్ట్ పై అతడి తల్లిదండ్రులు స్పందించారు. టెన్ టీవీతో మాట్లాడిన వారు.. రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో తమ కుమారుడు ఉన్నట్లు తమకు తెలియదన్నారు. మీడియాలో వచ్చిన కథనాలతో తమ కుమారుడు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించామన్నారు. విషయం తెలుసుకుని హైదరాబాద్ కి వస్తే తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదన్నారు.(Secuderabad Violence Pruthvi)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తమ కుమారుడు పృథ్వీ గుంటూరులోని సాయి డిఫెన్స్ అకడామీలో నాలుగేళ్ల క్రితం కోచింగ్ తీసుకున్నాడని తెలిపారు. ఆర్మీ ఉద్యోగం కోసం చాలా ఏళ్ల నుండి కష్టపడుతున్నాడని వెల్లడించారు. తమ కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. తమ కుమారుడితో 10 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

శనివారం నుండి తన కుమారుడి ఫోన్ స్విచ్చాఫ్ ఉందన్నారు. అసలు ఇంత విధ్వంసం జరిగిందనే విషయం కూడా తమకు తెలియదని వారు వాపోయారు. సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహాకులే తమ కుమారుడిని తీసుకెళ్లి ఉంటారని పృథ్వీ తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు

సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం (జూన్ 17) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగి మరణించాడు. పలువురు గాయపడ్డారు.(Secunderabad Violence Pruthvi)

ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో బుధవారం పోలీసులు మరో 10మందిని అరెస్ట్ చేశారు.

ఇవాళ అరెస్ట్ అయిన నిందితుల పేర్లు..
ఏ2 రాథోడ్ పృథ్వీరాజ్
ఏ3 బింగి రమేశ్
ఏ4 రాజా సురేంద్ర కుమార్
ఏ5 సంతోష్
ఏ6 మహ్మద్ సబార్
ఏ57 యోగేష్
ఏ58 పరుశురాం
ఏ59 అయ్యప్పచారి
ఏ60 శివసుందర్ రెడ్డి
ఏ61 తుకారాం