Secunderabad Fire Case : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. బోగీలకు నిప్పు పెట్టింది వీళ్లే.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. రైల్వే స్టేషన్ లో ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టింది ఆదిలాబాద్ కు చెందిన..

Secunderabad Fire Case : సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. రైల్వే స్టేషన్ లో ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టింది ఆదిలాబాద్ కు చెందిన పృథ్వీగా తేల్చారు పోలీసులు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఆ తర్వాత విధ్వంసం వీడియోలను అతడు గ్రూప్ లో షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో ఏ12గా ఉన్న పృథ్వీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు పృథ్వీతో పాటు పోలీసుల అదుపులో మరో 9మంది ఉన్నారు. వీరందరిని రిమాండ్ కు తరలించనున్నారు.
తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టైంది ఆర్మీ అభ్యర్థుల పరిస్థితి. రైల్వే స్టేషన్ లో విధ్వంసం చేసే సమయంలో అభ్యర్థులు సెల్ఫీ వీడియోలు, సెల్ఫీ తీసుకున్నారు. ఇదే ఇప్పుడు వారి కొంప ముంచింది. ఆ వీడియోలు, సెల్ఫీల ఆధారంగానే పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ గ్రూపుల్లో విధ్వంసం వీడియోలు పెట్టిన హల్ చల్ చేశారు. ఆ వీడియోలే విధ్వంసకారులను అడ్డంగా బుక్ చేశాయి. పోలీసులకు ఓ ఆధారంగా మారాయి.
Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
పోలీసులు సేకరించిన వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 200మందికిపైగా ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులో ప్రధానంగా పృథ్వీరాజ్ చేసిన విధ్వంసం వెలుగు చూసింది. అతడు బోగీల్లో కూర్చున్న ప్యాసింజర్లను బయటకు పంపి మరీ బోగీలకు నిప్పంటించాడు. ఆ తర్వాత కర్రతో బోగీ అద్దాలను ధ్వంసం చేశాడు. వారు చేసిన విధ్వంసాన్ని ఈ వీడియోలు కళ్లకు కట్టాయి. బోగీలకు నిప్పు పెట్టడం, అద్దాలను ధ్వంసం చేయడమే కాదు.. స్టేషన్ లోని స్టాల్స్ కు ఉన్న తలుపులు ఊడపీకి వాటిని నెత్తి మీద పెట్టుకుని తీసుకొచ్చి మరీ బోగీలపై విసిరేశాడు.
agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు
ఈ కేసులో ఏ1గా ఉన్న మధుసూదన్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థులకు షెల్టర్ ఇచ్చి వారికి వసతి కల్పించి, వారిని రెచ్చగొట్టిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావుని కూడా నిన్న నరసరావుపేటలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. అతడిని హైదరాబాద్ తీసుకొచ్చారు. సుబ్బారావుని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. సుబ్బారావుతో పాటు డిఫెన్స్ అకాడమీకి చెందిన మరికొందరు డైరెక్టర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్.. అగ్గి రాజేసింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపింది. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పని చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. యువతలో తీవ్ర ఆగ్రహానికి ఇదే ప్రధాన కారణం అవుతోంది.
ఈ నిబంధనను నిరసిస్తూ యువత రోడ్డెక్కింది. ఆందోళన బాట పట్టింది. పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీహార్ లో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. మరోవైపు మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసకాండ జరిగింది.
సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం (జూన్ 17) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగి మరణించాడు. పలువురు గాయపడ్డారు.
- Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..
- Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?
- Avula Subba Rao : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 10టీవీ చేతిలో సెకండ్ రిమాండ్ రిపోర్ట్.. సూత్రధారులు ఆ ఇద్దరే
- Secunderabad Riots : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. మరో 10మంది అరెస్ట్, తమ పిల్లలు అమాయకులంటున్న తల్లిదండ్రులు
- Secunderabad Violence Pruthvi : నా కుమారుడు బోగీలకు నిప్పు పెడతాడని ఊహించలేదు- పృథ్వీ తల్లిదండ్రులు
1Viral Video : గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్
2Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు శివసేన
3CM Pinarayi vijayan : ‘కేరళ సీఎంను పినరయి విజయన్ను కాల్చి పారేస్తా’: మాజీ ఎమ్మెల్యే భార్య సంచలన వ్యాఖ్యలు
4Delhi: కుక్క మొరిగిందని దాని యజమాని కుటుంబంపై రాడ్‌తో దాడి.. వీడియో
5Chiranjeevi : అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవి.. రాజమండ్రిలో భారీ స్వాగతం పలికిన మెగా అభిమానులు..
6PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్
7Maharashtra: బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగింది.. అంతే: సంజయ్ రౌత్
8Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై మరో రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా
9Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..
10Himachal Pradesh: ఘోర బస్సు ప్రమాదం.. స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు