Harish Rao On Rahul Gandhi : ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం-రాహల్ గాంధీపై తీవ్ర విమర్శలు

రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అన్నారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ 96శాతం ఓటమి పాలైందన్నారు.

Harish Rao On Rahul Gandhi : ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం-రాహల్ గాంధీపై తీవ్ర విమర్శలు

Harish Rao On Rahul Gandhi

Harish Rao On Rahul Gandhi : తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాహుల్ పైన, కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అని, ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ 94 శాతం ఓటమి పాలైందన్నారు. స్థానికంగా సఖ్యత లేని కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ వచ్చి ఏం చేస్తాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీది ఒడిసిన చరిత్ర అన్నారు హరీశ్ రావు.

”ఒక డీల్ ఇచ్చింది లేదు. ఏదో రాహుల్ గాంధీ వస్తాడని, ఉద్దరిస్తాడని చెబుతున్నారు. నీ ఇల్లే సక్కగా లేదు. తెలంగాణకొచ్చి నువ్వు చేసేదేముంది? రాహుల్ వచ్చి తెలంగాణ ఉద్దరిస్తాడంట. ఎక్కడ పోయినా రాహుల్ గాంధీ అడుగు పెడితే ఐరన్ లెగ్గే. ఓటమి తప్ప గెలుచుడు రాదు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఓడింది 94శాతం. గెలిచింది 6 శాతం. ఏడ పోయినా ఓడుడే. ఉన్న పంజాబ్ ఊడగొట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఒక్క సీటు లేకుండా పోయింది. ఢిల్లీలో అడ్రస్ లేదు. ఉత్తరప్రదేశ్ లో అడ్రస్ లేదు. హర్యానాలో పత్తా లేకుండా పోతున్నారు. తెలంగాణకు వచ్చి ఉద్దరిస్తాడట. కాంగ్రెస్ అనేది గతం. మీది ఒడిసిన చరిత్ర” అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.(Harish Rao On Rahul Gandhi)

నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో శుక్రవారం మంత్రి హరీశ్​ రావు ప‌ర్య‌టించారు. కామారెడ్డి జిల్లా న‌స్రుల్లా బాద్ మండ‌లంలోని దుర్కిలో రూ.40 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయానికి.. వర్ని మండలం జాకోర గ్రామం దగ్గర రూ. 69.52 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న జాకోర ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీష్ రావు, శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు.

MLA Jaggareddy : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తెలంగాణ పర్యటనకు శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని.. వరంగల్‌ రైతు సంఘర్షణ సభ ద్వారా ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే వరంగల్‌లో పర్యటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు.. స్థానిక నేతలతో సమావేశమై సభ నిర్వహణపై సమీక్షించారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మే 6, 7వ తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మే 6 న వరంగల్ లో రైతు సమస్యలపై భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మే 7 న హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. కాంగ్రెస్ నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. పర్యటనలో భాగంగా ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే ఓయూ వీసీని అనుమతి కోరింది. అయితే ఇప్పటివరకు ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతులు రాలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

KTR : కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు : కేటీఆర్

కాగా, తెలంగాణలో రాహుల్‌గాంధీ టూర్‌ పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్‌ గాంధీ ఓయూలో అడుగుపెట్టాలని బాల్క సుమన్ చేసిన కామెంట్లు ఇప్పటికే కాక రేపాయి. దీనిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగానే స్పందించారు. బాల్క సుమన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బాల్క సుమన్ వ్యవహారాలపై విచారణ జరిపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే నీకు పదవి వచ్చి ఉండేదా? అని బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. నిన్న బాల్క సుమన్, నేడు హరీశ్ రావు.. రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శల డోస్ పెంచారు.