Minister KTR : కాంగ్రెస్ కాలకేయుల పార్టీ.. రాబందుల రాజ్యం వస్తే రైతుబంధు రద్దవ్వడం ఖాయం : మంత్రి కేటీఆర్

ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతారని అన్నారు. ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అథమ స్థానానికి పోతుందని కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు.

Minister KTR : కాంగ్రెస్ కాలకేయుల పార్టీ.. రాబందుల రాజ్యం వస్తే రైతుబంధు రద్దవ్వడం ఖాయం : మంత్రి కేటీఆర్

Minister KTR (2)

Minister KTR – Congress Party : మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనంతా మోసమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ కాలకేయుల పార్టీ అని విమర్శించారు. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పప్పులు ఉడకవని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యమొస్తే రైతు బంధు రద్దవ్వటం గ్యారంటీ అని ఆరోపించారు.

ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతారని అన్నారు. ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అథమ స్థానానికి పోతుందని కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ హామీలపై ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అర్ధ శాతాబ్ధపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం అని విమర్శించారు.

KTR: తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్ సంచలన కామెంట్స్

రాబందుల రాజ్యం వస్తే.. రైతు బంధు రద్దవడం ఖాయం అన్నారు. స్కాముల పార్టీకి స్వాగతం చెప్తే.. స్కీమ్ లు ఎత్తేయడం గ్యారంటీ అని చెప్పారు. ఇది మీ కపట కథలు తెలిసిన తెలంగాణ గడ్డ.. ఇక్కడ మీ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవు అని అన్నారు.

దగా కోరుల పాలన వస్తే ధరణి పోర్టల్ రక్షణ ఎగిరిపోవడం తథ్యమని బకాసురులు గద్దెనెక్కితే రైతు బీమా గల్లంతవుతుందని చెప్పారు. ఢిల్లీ కీలు బొమ్మలు కుర్చీనెక్కితే ఆత్మ గౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారంటీ అన్నారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపద అంతా స్వాహా చేస్తారని ఆరోపించారు.

KTR: అందుకే తెలంగాణ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా? కేటీఆర్ చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా?

పనికి మాలిన వాళ్లు పవర్ లోకి వస్తే పరిశ్రమలు పారిపోతాయని, భూముల ధరల పడిపోతాయని చెప్పారు. ఆర్థిక శాస్త్రం తెలియని అరాచకులకు అవకాశమిస్తే ఎకానమీ ఏట్లో కలవడం తథ్యమన్నారు. జోకర్లు, బ్రోకర్లకు పీఠాన్ని ఇస్తే పరువు, ప్రతిష్టలు గంగలో కలుస్తాయన్నారు. దాచి దాచి దయ్యాలకు పెట్టేంత ఎడ్డిది తెలంగాణ కాదని చెప్పారు.