Ayyappa Mala : ప్రిన్సిపాల్ ఓవరాక్షన్.. మాల ధరించిన విద్యార్థిని స్కూలు నుంచి వెళ్ళగొట్టాడు

అయ్యప్ప మాలతో వెళ్లిన టెన్త్ ​స్టూడెంట్​ను సంగారెడ్డి జిల్లాలోని ఓ స్కూలు ప్రిన్సిపల్ లోనికి రావద్దని అడ్డుకున్నాడు. మాల తీసే వరకు స్కూలుకి రావద్దని వెనక్కి పంపారు.

Ayyappa Mala : ప్రిన్సిపాల్ ఓవరాక్షన్.. మాల ధరించిన విద్యార్థిని స్కూలు నుంచి వెళ్ళగొట్టాడు

Ayyappa Mala

Ayyappa Mala : అయ్యప్ప మాలతో వెళ్లిన టెన్త్ ​స్టూడెంట్​ను సంగారెడ్డి జిల్లాలోని ఓ స్కూలు ప్రిన్సిపాల్ లోనికి రావద్దని అడ్డుకున్నాడు. మాల తీసే వరకు స్కూలుకి రావద్దని వెనక్కి పంపాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు. విద్యార్థి తల్లి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసింది. విద్యార్థి తల్లి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేటకు చెందిన రాకేశ్ స్థానిక సెయింట్ మేరీ హైస్కూల్​లో టెన్త్​ క్లాస్​ చదువుతున్నాడు. అయ్యప్ప మాల ధరించిన రాకేశ్ ​సోమవారం స్కూల్​కు వెళ్లాడు.

చదవండి : Sabarimala Ayyappa: తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం.. రోజుకు 30వేల మందికి అనుమతి

స్కూల్ ప్రిన్సిపాల్ అతన్ని అడ్డుకున్నాడు. మాలలో ఉంటే అనుమతించమని.. మాల తీసేసే వరకు స్కూలుకు రావొద్దని వెనక్కి పంపించాడు. విషయం రాకేష్ తన తల్లికి చెప్పడంతో ఆమె వచ్చి యాజమాన్యాన్ని నిలదీసింది. మాలతో వస్తే ఎందుకు అనుమతించరని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించింది. విషయం అయ్యప్ప స్వాముల దృష్టికి వెళ్లడంతో, వారు స్కూలు వద్దకు చేరుకొని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.

చదవండి : Sabarimala Ayyappa Temple : ఈరోజు సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం

దీంతో రాకేష్‌ను స్కూలులోకి అనుమతించారు. కాగా ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి.. ఆ సమయంలో కూడా అయ్యప్పస్వామి భక్తులు, బీజేపీ నేతలు స్కూలు యాజమాన్యంతో వాగ్వాదానికి అనుమతించారు. ఇలాంటివి రిపీట్ ​అయితే సహించేది లేదని హెచ్చరించారు అయ్యప్పస్వాములు.