Marredpally Vaccination Chaos : వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర తొక్కిసలాట, సెకండ్ డోసు కోసం ఎగబడిన జనాలు

సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి వాక్సినేషన్ సెంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈరోజు ఉదయం నుంచి టీకా కేంద్రం జనం కిక్కిరిసిపోయారు. వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడ్డారు. ఒకేసారి గేట్లను ఓపెన్ చేయడంతో గందరగోళం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Marredpally Vaccination Chaos : వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర తొక్కిసలాట, సెకండ్ డోసు కోసం ఎగబడిన జనాలు

Marredpally Vaccination Chaos

Marredpally Vaccination Chaos : సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి వాక్సినేషన్ సెంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈరోజు ఉదయం నుంచి టీకా కేంద్రం జనం కిక్కిరిసిపోయారు. వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడ్డారు. ఒకేసారి గేట్లను ఓపెన్ చేయడంతో గందరగోళం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

రెండో డోస్ కోసం గత వారం రోజులుగా ప్రజలు భారీగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ సెంటర్ గేట్లను ఒకేసారి తెరవడంతో తొక్కిసలాటకు దారితీసింది. సుమారుగా 2వేల మంది కొవాగ్జిన్ సెకండ్ డోసు కోసం సెంటర్ దగ్గరికి వచ్చినట్టు తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

”800 మందికి మాత్రమే వ్యాక్సిన్ స్లాట్స్ ఇచ్చారు. కానీ, మరో 1200మంది వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చేశారు. అక్కడ కోవాగ్జిన్ దొరుకుతుందో లేదో కనుక్కోవడానికి వచ్చారు. వారిలో చాలామంది జూన్ లో తొలి డోసు తీసుకున్న వారే. గేట్లు తీసిన వెంటనే జనాలు బలవంతంగా లోనికి వచ్చే ప్రయత్నం చేశారు. వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాము. క్యూలో నిల్చోవాలని కోరాము. అయినా ఎవరూ వినిపించుకోలేదు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను పిలవాల్సి వచ్చింది” అని వ్యాక్సిన్ సెంటర్ అధికారులు తెలిపారు. మొత్తం 30మంది ఆరోగ్య సిబ్బందిని అధికారులు నియమించారు. ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు. పేర్లు రిజిస్ట్రర్ చేసుకోవడానికి టోకెన్లు ఇవ్వడానికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చిన వారిలో చాలామంది తమ ఫస్ట్ డోసు జూన్ లో తీసుకున్నారు. తొలి డోసు తీసుకుని 28 రోజులు అయ్యింది. కాగా, మాకు 800కి సరిపోడ టీకా డోసులు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న 800మందికి టోకెన్లు జారీ చేశాము అని మెడికల్ ఆఫీసర్ ఇంచార్జి పవన్ కుమార్ చెప్పారు.

అయితే, ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా తమకు స్లాట్ రాలేదని చాలామంది చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారమే కొవిన్ లో స్లాట్ బుక్ చేసుకుని, క్యూలో గంటసేపు నిల్చున్నా టోకెన్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాగా, వ్యాక్సిన్ సెంటర్ దగ్గర వేల మంది జనాలను చూసి కొంతమంది వెనక్కి వెళ్లిపోయారు. అక్కడి పరిస్థితిని చూసి భయపడి వ్యాక్సిన్ తీసుకోకుండానే వెనుదిరిగామన్నారు. అక్కడ పరిస్థితిని చూశాక కొంతమంది ఫ్రీ వ్యాక్సిన్ వదిలేసి పెయిడ్ వ్యాక్సిన్ వైపు మొగ్గుచూపారు. అక్కడ చాలామందికి మాస్కులు లేవు, భౌతిక దూరం అసలే లేదని వాపోయారు. కాగా, అధికారుల తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు సరిగా చెయ్యలేదని మండిపడుతున్నారు. వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను పెంచండి లేదా టీకా డోసుల సంఖ్యను అయినా పెంచండి అని డిమాండ్ చేస్తున్నారు.