Subba Rao : సుబ్బారావుకి రూ.50కోట్ల నష్టం..! అందుకే ఈ దుర్మార్గం.. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో షాకింగ్ విషయాలు
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం.. అతడికి పది కాదు 20 కాదు.. ఏకంగా రూ.50 కోట్ల నష్టం వచ్చే పరిస్థితి తెచ్చింది. అంతే, స్కెచ్ వేశాడు. పక్కాగా ప్లాన్ చేశాడు. కుట్రపన్ని అభ్యర్థులను రెచ్చగొట్టాడు. రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక మాస్టర్ మైండ్ అతడే.

Subba Rao : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థులను రెచ్చగొట్టి వారితో విధ్వంసం చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు రాబట్టారు. విధ్వంసం వెనుక సుబ్బారావు హస్తం ఉందని తేల్చరు. 10కి పైగా వాట్సాప్ గ్రూప్ లు క్రియేట్ చేసి పక్కా ప్లాన్ తోనే సుబ్బారావు విద్యార్థులను రెచ్చగొట్టాడని నిర్ధారించారు. దీంతో సుబ్బారావుతో సహా నిన్న అదుపులోకి తీసుకున్న 15 మందిని రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
దేశవ్యాప్తంగా సుబ్బారావుకి 9 డిఫెన్స్ అకాడమీలు ఉన్నాయి. ఆర్మీ కోచింగ్ పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2లక్షల ఫీజు వసూలు చేస్తున్నాడు. అభ్యర్థులు తన అకాడమీలో చేరేలా ఆకర్షించేందుకు పేమెంట్ ను విడతల వారీగా చెల్లించే అవకాశం ఇచ్చాడు. అంతేకాదు తన వద్ద శిక్షణ తీసుకుంటే జాబ్ గ్యారంటీ అంటూ అభ్యర్థులను ఆకట్టుకుంటున్నాడు. అయితే, ఆర్మీకి సెలెక్ట్ అయిన తర్వాతే మొత్తం అమౌంట్ చెల్లించేలా అభ్యర్థులకు కొటేషన్ ఇచ్చాడు. గ్యారంటీ కింద అభ్యర్థులకు చెందిన టెన్త్ మెమోలు తీసుకున్నాడు.(Subba Rao)
Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
అయితే, ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్ష రాసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం ప్రకటించింది. ఇందుకు రాతపరీక్ష అవసరం లేదు. దీంతో సుబ్బారావుకి మైండ్ బ్లాంక్ అయ్యింది. సుబ్బారావుకి అభ్యర్థుల నుంచి రావాల్సిన దాదాపు రూ.50 కోట్లు ఆగిపోయాయి. దీంతో ఎలాగైనా అభ్యర్థులను రెచ్చగొట్టి రాతపరీక్ష నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్లాన్ చేశాడు సుబ్బారావు. దాని ఫలితమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థుల విధ్వంసకాండ.
agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు
ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో ఇప్పటికే 71మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకో 25 మంది పై వారి పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీంతో అరెస్టుల సంఖ్య 100కు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారంతా ఆర్మీ ఉద్యోగాల కోసం వేచ్చి చూస్తున్న వారే. ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఫిట్ నెస్ సాధించిన వారే ఉన్నారు. మొత్తంగా తన స్వార్థం కోసం సుబ్బారావు చేసిన పని తమ పిల్లల జీవితాలను నాశనం చేసిందని వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం (జూన్ 17) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగి మరణించాడు. పలువురు గాయపడ్డారు.
- Avula Subba Rao : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 10టీవీ చేతిలో సెకండ్ రిమాండ్ రిపోర్ట్.. సూత్రధారులు ఆ ఇద్దరే
- Secunderabad Riots : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. మరో 10మంది అరెస్ట్, తమ పిల్లలు అమాయకులంటున్న తల్లిదండ్రులు
- Secunderabad Violence Pruthvi : నా కుమారుడు బోగీలకు నిప్పు పెడతాడని ఊహించలేదు- పృథ్వీ తల్లిదండ్రులు
- Secunderabad Fire Case : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. బోగీలకు నిప్పు పెట్టింది వీళ్లే.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు
- Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
1Shraddha Das: శ్రద్ధగా వయ్యారాలను ఒలకబోస్తున్న శ్రద్ధా దాస్!
2Amaravati Lands : అమ్మకానికి అమరావతి భూములు.. 600 ఎకరాల భూముల విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు
3అరసాడలో సుడిగాలి బీభత్సం
4కొల్లాపూర్ పంచాయితీపై కేటీఆర్ ఫోకస్
5రెబల్స్‌కు నోటీసులు.. గేమ్ మొదలెట్టిన సీఎం ఠాక్రే
6Vijayawada : రేపటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోగాకు నిషేధం
7PM Modi: జీ7 సదస్సులో పాల్గొననున్న మోదీ
8Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
9Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
10Village ward secretariat employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది.. భారీగా పెరిగిన జీతాలు
-
Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?
-
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో హెల్త్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?
-
Sita Ramam: సీతా రామం.. యుద్ధంతో రాసిన ప్రేమాయణం!
-
Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!
-
Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!
-
Rainy Season : వర్షాకాలం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!
-
Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?