Drug Case : డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు | Sensational issues in drug case remand report

Drug Case : డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు ఇద్దరు ఆఫీస్ బాయ్స్ ను అరెస్టు చేశారు. టోనీతో సంబంధాలున్న నలుగురు వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నారు.

Drug Case : డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

drug case remand report : డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో మరికొన్ని విషయాలోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో మొత్తం 23 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 10 మంది పరారీలో ఉన్నట్లు నగర పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు ఇద్దరు ఆఫీస్ బాయ్స్ ను అరెస్టు చేశారు. టోనీతో సంబంధాలున్న నలుగురు వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నారు. అశోక్ జైన్, సోమ శశికాంత్, గజేంద్ర ప్రసాద్, సంజయ్ పరారీలో ఉన్నారు.

నిన్న డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలు పోలీసులు అరెస్ట్ చేశారు. వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ బిజినెస్ మెన్ లు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ముంబై డ్రగ్ మాఫియా టోనీతో వ్యాపారవేత్తలు నిత్యం డ్రగ్స్ తెప్పించుకున్నారు. పాత బస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండిని అరెస్ట్ చేశారు. మసాలా దినుసులతో ఆనంద్ ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. A-1 కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్ అరెస్ట్ చేశారు. నగరంతో పాటు పలు ప్రాంతాల్లో నిరంజన్ కుమార్ బ్రిడ్జీలను నిర్మిస్తున్నారు.

Road Accident : డీసీఎంను ఢీకొన్న బైక్, ముగ్గురు మృతి

ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్ ను అరెస్టు చేశారు. హైదరాబాద్ తో పాటు ఆంధ్రాలో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారాలు చేస్తున్నారు. శంషాబాద్ లోని వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లో eta surf ను జైన్ పరిచయం చేశారు. ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పలు ప్రభుత్వ కాంట్రాక్టర్లను ఆయన చేపట్టారు. నిరంజన్ జైన్, సుమంత్ రెడ్డి కలిసి హైదరాబాద్ లో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.

ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బండి భార్గవ్ పలు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. ప్రముఖ export and import వ్యాపారి వెంకట్ చలసానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర, తెలంగాణలో ప్రముఖ ఎక్స్పోర్ట్ గా చలసాని వెంకట్ కొనసాగుతున్నారు. భార్గవ్, వెంకట్ లు కలిసి పార్టనర్స్ గా ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారు.

Minister KTR : తెలంగాణలో నేతన్నలను పట్టించుకోని కేంద్రం : మంత్రి కేటీఆర్

భార్గవ్, వెంకట్ కలిసి హైదరాబాద్ లోని అంతర్జాతీయ స్కూల్లో చదువుకున్నారు. భార్గవ్, వెంకట్ కలిసి వందల కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించారు. వెంకట్ చలసాని తండ్రి పెద్ద కాంట్రాక్టరు. వ్యాపారవేత్త తమ్మినేని సాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై డ్రగ్ మాఫియా డాన్ టోనీతో వ్యాపారవేత్తలకు సంబంధాలు ఉన్నాయి. టోనీ మనుషుల చేత నిత్యం వ్యాపారవేత్తలు డ్రగ్స్ తెప్పించుకున్నారు.

×