NIA Charge Sheet On Pfi Operation : యోగా ముసుగులో ఉగ్రవాద ట్రైనింగ్, మనుషులను ఎలా చంపాలో PFI ట్రైనింగ్

 పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (Pfi)ఆపరేషన్‎పై ఎన్ఐఏ ఛార్జ్‎షీట్‎లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యోగా ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గుర్తించింది. ఈ ట్రైనింగ్ లో మనుషులను ఎలా చంపాలో ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా గురత్ించింది.

NIA Charge Sheet On Pfi Operation : యోగా ముసుగులో ఉగ్రవాద ట్రైనింగ్, మనుషులను ఎలా చంపాలో PFI ట్రైనింగ్

NIA Charge Sheet On Pfi Operation

NIA Charge Sheet On Pfi Operation : పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (Pfi)ఆపరేషన్‎పై ఎన్ఐఏ ఛార్జ్‎షీట్‎లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. యోగా ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గుర్తించింది. నిజామాబాద్ నుంచి 200 మందికి శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ అభియోగం. ఈ ట్రైనింగ్ లో మనుషులను ఈజీగా ఎలా చంపొచ్చే..మారణాయుధాలు వినియోగింపై కూడా ప్రత్యేక క్లాసుల ద్వారా ట్రైనింగ్ సీఎఫ్ఐ ట్రైనింగ్ ఇస్తోందని ఎన్ఐఏ చార్జ్ షీటులో పేర్కొంది. ఇప్పటికే పీఎఫ్ఐపై దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించగా..దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీఎస్ఐ సంస్థలు పలు ప్రాంతాల్లో సదరు సంస్థ సభ్యుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

పీఎఫ్‌ఐ తీవ్రవాద శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోందని..పలువురిని ఆకర్షించి వారికి ఉగ్రవాద శిక్షణ ఇస్తోందని ఎన్‌ఐఏ తెలిపింది. పీఎఫ్ఐ కదలికలపై నిఘా పెట్టిన ఎన్ఐఏ పలు ఆధారాలను సేకరించింది. ఈ వివరాలను చార్జ్ షీటు పొందుపరించింది. ఈ చార్జ్ షీటును హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టుకు ఛార్జిషీట్ అందజేసింది. దీంట్లో షాకింగ్ విషయాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. రాడ్డు, కత్తి, కర్ర వంటి ఆయుధాలను ఎలా వాడాలి? ఎదుటివారిపై ఎలా దాడి చేయాలి? ఆయుధాలతో ఎలా చంపాలి? మనుషుల శరీరంలో ఎక్కడెక్కడ సున్నిత ప్రాంతాలుంటాయి? ఎక్కడ కొడితే మనిషి త్వరగా చనిపోతాడు?వంటి అత్యంత భయంకరమైన విషయాలపై పీఎఫ్ఐ శిక్షణ ఇస్తోందని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.

అమాయక ముస్లిం యువకులకు మాయమాటలు చెప్పి ఉగ్రవాదులుగా తయారు చేస్తోంది పీఎఫ్ఐ. వారికి ఉగ్రవాద శిక్షణ ఇస్తోందని గుర్తించింది ఎన్ఐఏ. పీఎఫ్ఐలో చేరిన తర్వాత యువకులను శిక్షణా శిబిరాలకు పంపించి మారణాయుధాలను ఎలా ఉపయోగించాలి? మనుషును సులువగా ఎలా చంపాలి? అనే వాటిపై ట్రైనింగ్ ఇస్తోందని ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఉగ్రవాద శిక్షలు అన్నీ యోగా సెంటర్ల ముసుగులో నిర్వహిస్తోందని ఎన్ఐఏ గుర్తించింది.

తెలంగాణలో పీఎఫ్ఐ కదలికలను గుర్తించిన అధికారులు ఆరు నెలల తర్వాత 11 మందిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జులైలో నిజామాబాద్ జిల్లాలో కేసు నమోదు చేశారు. ఈక్రమంలో ఎన్ఐఏ సేకరించిన పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించారు.