Student Suicide In Hyderabad IIT : హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు..తాజాగా మరో స్టూడెంట్ సూసైడ్

హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్‌ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. నంద్యాలకు చెందిన ఎంటెక్ స్టూడెంట్‌ రాహుల్ సూసైడ్ ఘటన మరవక ముందే.. మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థి మేఘాకరూర్‌ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజస్థాన్‌ జోథ్‌పూర్‌ వాసి.

Student Suicide In Hyderabad IIT : హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు..తాజాగా మరో స్టూడెంట్ సూసైడ్

Student Suicide In Hyderabad IIT : హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్‌ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. నంద్యాలకు చెందిన ఎంటెక్ స్టూడెంట్‌ రాహుల్ సూసైడ్ ఘటన మరవక ముందే.. మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థి మేఘాకరూర్‌ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజస్థాన్‌ జోథ్‌పూర్‌ వాసి. మేఘాకపూర్‌ ఆత్మహత్యపై పోలీసులు అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన పోతిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. వారం రోజుల వ్యవధిలో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన మేఘాకపూర్‌ సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని ఓ హోటల్‌పై నుంచి దూకి సూసైడ్‌ చేసుకున్నాడు. మూడు నెలల క్రితమే బీటెక్‌ పూర్తి చేసిన మేఘాకపూర్.. అప్పటి నుంచి సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఇటీవల ఇక్కడకు వచ్చి కుమారుడిని కలిసి వెళ్లారు. ఆగస్టు 31న ఏపీలోని నంద్యాలకు చెందిన ఎంటెక్ విద్యార్థి రాహుల్‌ ఐఐటీ క్యాంపస్‌ హాస్టల్‌ రూమ్‌లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

IIIT Basra : బాసర ట్రిపుల్ ఐటీలో ప్రమాదం.. క్లాస్ రూమ్‌లో ఊడిపడిన పెచ్చులు.. విద్యార్థికి గాయాలు

ఎరైనా ఫ్యాన్‌కు ఉరేసుకుంటారు. కానీ రాహుల్ మంచానికి ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. రాహుల్ మృతి చెందిన 8 రోజులకే మేఘాకపూర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ఐఐటీలో ఆందోళన నెలకొంది. వరుస ఘటనలపై విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ ఐఐటీ ఆత్మహత్యల ఖిల్లాగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతకుముందు కూడా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలున్నాయి.

హైదరాబాద్‌ ఐఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగానే జరగుతున్నాయి. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 8 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడం ఆందోళనకర పరిణామం. అధిక ఒత్తిడితో ఒకరు, మానసిక రుగ్మతతో మరొకరు, ఇతరులతో పోటీలో నిలుస్తామో.. లేదో.. అన్న బెంగతో మరొకరు ఇలా రకరకాల కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం విషాదకరం.

Basara IIIT Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

2019లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో పిచికల సిద్ధార్థ ఒకరు కాగా.. వారణాసికి చెందిన మార్క్‌ ఆండ్రూ చార్లెస్‌ మరొకరు. సిద్ధార్థ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్క్‌ ఆండ్రూ చార్లెస్‌కు ఆత్మహత్యకు అధ్యాపకుల వేధింపులే కారణమన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. 2014-21 ఐఐటీల్లో 34 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే.. ఎన్‌ఐటీల్లో 30 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఐఐటీల్లో ఎక్కువ ఆత్మహత్యలు హైదరాబాద్‌ సంస్థలోనే నమోదయ్యాయి. దీనిని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.