Milk Price: పాల ధరను రెండు రూపాయలు పెంచిన సిద్స్ ఫార్మ్

ఈ సవరించిన ధరలతో 500 మిల్లీ లీటర్ల ఏ2 గేదె పాల ప్యాకెట్‌ ధర 52 రూపాయలు కాగా, స్కిమ్‌ పాల ధర 32 రూపాయలుగా ఉంటుంది. ఇక ఏ2 డబుల్‌ టోన్డ్‌ గేదె పాల ధర 42 రూపాయలుగా ఉండనుంది. అయితే ఏ2 దేశీ ఆవు పాల ధరలో మాత్రం మార్పులు చేయలేదు. గతంలో ఉన్నట్లుగానే అర లీటరుకు 75 రూపాయలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు

Milk Price: పాల ధరను రెండు రూపాయలు పెంచిన సిద్స్ ఫార్మ్

sid's farm increased rs2 for milk

Milk Price: తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డీటూసీ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌.. పాల ధరను తాజాగా పెంచినట్లు ప్రకటించింది. గేదె పాలు, స్కిమ్‌ మిల్క్‌, డబుల్‌ టోన్డ్‌ గేదె పాల ధరను ప్యాకెట్‌కు 2 రూపాయలు పెంచుతున్నట్లు శుక్రవారం ఆ కంపెనీ వెల్లడించింది. ఈ సవరించిన ధరలతో 500 మిల్లీ లీటర్ల ఏ2 గేదె పాల ప్యాకెట్‌ ధర 52 రూపాయలు కాగా, స్కిమ్‌ పాల ధర 32 రూపాయలుగా ఉంటుంది. ఇక ఏ2 డబుల్‌ టోన్డ్‌ గేదె పాల ధర 42 రూపాయలుగా ఉండనుంది. అయితే ఏ2 దేశీ ఆవు పాల ధరలో మాత్రం మార్పులు చేయలేదు. గతంలో ఉన్నట్లుగానే అర లీటరుకు 75 రూపాయలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా ముడిపాలు ధరలు స్ధిరంగా పెరుగుతుండటంతో దాదాపు ప్రతి డెయిరీ బ్రాండ్‌ తమ పాల ధరలను సవరిస్తున్నాయి.

Thalapathy 67: ‘లియో’ బ్లడీ స్వీట్ అంటూ టైటిల్ రివీల్ ప్రోమోతో దూసుకొచ్చిన విజయ్..!

ఈ విషయమై సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘మా వినియోగదారులకు అత్యున్నత నాణ్యత కలిగిన పాల ఉత్పత్తులను అందిస్తుండటం పట్ల మేము చాలా గర్వపడుతున్నాం. పాలు, పన్నీర్‌, నెయ్యి, పాలు, వెన్న సరఫరాదారునిగా అందుబాటు ధరలలో అత్యుత్తమ ఉత్పత్తులను అందించేందుకు ప్రయత్నిస్తున్నాము. దురదృష్టవశాత్తు, ముడిపాల ధర పెరగడం వల్ల తప్పనిసరిగా ప్యాకెట్‌కు 2 రూపాయలు పెంచాల్సి వస్తుంది. వినియోగదారులకు కాస్త భారమైనప్పటికీ అత్యున్నత ప్రమాణాలను నిర్వహించేందుకు, పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’’ అని అన్నారు.

Paddy Harvesting And Threshing : వరి కోతలు, నూర్పిడి సమయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు!