TSPSC Paper Leak : సిట్ దూకుడు.. 42మంది TSPSC ఉద్యోగులకు నోటీసులు

42మంది టీఎస్ పీఎస్ సీ ఉద్యోగులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 9మంది నిందితులను ప్రశ్నిస్తున్న అధికారులు..

TSPSC Paper Leak : సిట్ దూకుడు.. 42మంది TSPSC ఉద్యోగులకు నోటీసులు

TSPSC Paper Leak : తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా 42మంది టీఎస్ పీఎస్ సీ ఉద్యోగులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 9మంది నిందితులను ప్రశ్నిస్తున్న అధికారులు.. ప్రవీణ్, రాజశేఖర్ తో సంబంధాలు ఉన్న వారిని సైతం విచారించారు. అలాగే వారి ఆర్ధిక వ్యవహారాలపైనా ఆరా తీస్తున్నారు.

తాజాగా టీఎస్ పీఎస్ సీలో పని చేస్తున్న 42మంది ఉద్యోగులకు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. వారిలో ఇప్పటికే 10 మందికి పైగా గ్రూప్-1 పరీక్ష రాసినట్టు సిట్ గుర్తించింది. గ్రూప్-1 రాసిన వారితో పాటు పలువురు మిగతా ఉద్యోగులకు కూడా నోటీసులు అందించింది.

Also Read..TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు

ఇక, పేపర్ లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. క్వశ్చన్ పేపర్ల గురించి ఉద్యోగ అభ్యర్థులతో రేణుక, ఆమె భర్త డాక్యా మాట్లాడినట్టు సిట్ భావిస్తోంది. రేణుక కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

TSPSC పేపర్ల లీక్ కేసులో సిట్ దర్యాఫ్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో ముగ్గురిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. వీరు రాజశేఖర్ నుంచి పేపర్ తీసుకుని పరీక్ష రాశారని సిట్ గుర్తించింది. గ్రూప్-1 పరీక్షలో 103 మందికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించింది. టీఎస్ పీఎస్ కి చెందిన 20 మంది ఉద్యోగులు.. గ్రూప్-1 పరీక్ష రాయగా.. వారిలో 8మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఇద్దరికి 100కు పైగా మార్కులు వచ్చాయి.