పోలియో చుక్కలు వేయటానికి అడవిలో 10 కి.మీ నడిచి వెళ్లిన ఆరోగ్య కార్యకర్త జ్ఞానేశ్వరి

పోలియో చుక్కలు వేయటానికి అడవిలో 10 కి.మీ నడిచి వెళ్లిన ఆరోగ్య కార్యకర్త జ్ఞానేశ్వరి

Telangana ANM Worker walking 10 kilometers forest  :  గత ఆదివారం దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. ఐదేళ్లలోపు చిన్నారులరు పోలియో చుక్కలు వేసే బాధ్యత ఆరోగ్య కార్యకర్తలదే. దేశ అభివృద్ధి చెందుతోందని చెప్పుకుంటున్న ఈరోజుల్లో కూడా పోలియో చుక్కలు వేయటానికి ఆరోగ్యం కార్తకర్తలు వాగులు వంకలు దాటుకుంటూ..అడవుల్లో కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి డ్యూటీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈక్రమంలో ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతాయో తెలీదు. కానీ డ్యూటీ చేయాలి. లేదండీ పోలియో భూతాన్ని రూపు మాపాల్సిన బాధ్యతో ఆరోగ్య కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని డ్యూటీలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఓ ఆరోగ్యం కార్యకర్త ఓ గ్రామంలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేయటానికి కారడవిలో 10కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన తెలంగాణాలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో చోటుచేసుకుంది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని రేగులగూడెంలో రెండో ఏఎన్‌ఎంగా జ్ఞానేశ్వరి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం పల్స్‌ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆదివారం వేయగా మిగిలిపోయిన పిల్లలను గుర్తించి చుక్కల మందు వేసేందుకు మంగళవారం (జనవరి 2) జ్ఞానేశ్వరికి ద్దిమడుగు ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సరైనదారికూడా లేదు.కాలినడకన వెళ్లడం కూడా కష్టమే. దారిలో కారడివి. ఎటునుంచి ఏ జంతువు మీద పడుతుందో కూడా తెలియదు. అయినా జ్ఞానేశ్వరి వెనుకడుగు వేయలేదు. తన డ్యూటీ నిర్వర్తించాలనుకుంది.

భర్తసహా ఎవరూ అందుబాటులో లేకపోవటంతో ఆమె ఒక్కరే కాలినడకన 10 కిలోమీటర్లు అడవిలో ఒక్కతే నడుచుకుంటూ మద్దిమడుగు వెళ్లింది.అక్కడ 35 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసింది. ఆలోగా పని ముగించుకుని వచ్చిన భర్త ఆమెను ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. ఇన్ని కష్టాలకు ఓర్చుకుని డ్యూటీని అంకితభావంతో నిర్వహించిన జ్ఞానేశ్వరిని వైద్య సిబ్బందితో పాటు గ్రామస్తులు అభినందించారు.

ఆ ప్రాంతానికి వెళ్లేందుకు రహదారి లేదు. కాలినడకన వెళ్లడం కూడా కష్టమే. కారడివిలో ఎటునుంచి ఏ జంతువు మీద పడుతుందో కూడా తెలియదు. అయినా ఇవేమీ ఆమె విధి నిర్వహణకు అడ్డంకి కాలేదు. ఓ మహిళా ఏఎన్‌ఎం కాలినడకన పది కిలోమీటర్లు వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేసి శ్రమ కన్నా విధులే మిన్న అని నిరూపించారు.