ఎలక్ర్టిక్ వాహనాల హబ్ గా తెలంగాణ – కేటీఆర్

  • Published By: madhu ,Published On : October 31, 2020 / 06:48 AM IST
ఎలక్ర్టిక్ వాహనాల హబ్ గా తెలంగాణ – కేటీఆర్

Telangana as the hub of electric vehicles – KTR : తెలంగాణ‌ను ఎల‌క్ట్రిక్ వాహ‌నాల హ‌బ్‌గా మార్చబోతున్నామ‌న్నారు మంత్రి కేటీఆర్‌. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామ‌న్న ఆయన… ఛార్జింగ్ స్టేష‌న్లు, బ్యాట‌రీ త‌యారీ కంపెనీలు ఇక్కడ పెట్టుబ‌డి పెట్టనున్నట్లు చెప్పారు. ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయ‌ని వివరించారు.తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీని మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. పాలసీ ప్రారంభించిన తొలిరోజే 3వేల 200 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.




కొత్త విధానం : – 
కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. తయారీ, పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించనుంది ఈ నూతన విధానం. హైదరాబాద్‌లో జరిగిన ఈవీ సమ్మి‌ట్‌లో ఎలక్ట్రికల్ వెహికల్ కొత్త విధానాన్ని కేటీఆర్ ప్రకటించారు. రాష్ర్టాన్ని ఎల‌క్ర్టిక్ వాహ‌నాల హ‌బ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో ఈ నూతన విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు కేటీఆర్. ఎల‌క్ర్టిక్ వాహ‌నాలు, ఇంధ‌న నిల్వల‌కు కొత్త విధానం అమ‌లు చేయ‌నున్నారు. 2020-2030 వ‌ర‌కు ఎల‌క్ర్టిక్ వాహ‌నాల త‌యారీ, వినియోగంపై విధాన‌మైన ప్రక‌ట‌న చేశారు.
https://10tv.in/minister-ktr-to-release-new-electric-vehicle-policy/
తయారీ యూనిట్లు : – 
ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్యను పెంచేందుకు సహకారం, భాగస్వామ్యం అనే అంశంపై ఈవీ సదస్సులో చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వల కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం..వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. కొత్త విధానం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉంది.

మెగా ప్రాజెక్టులకు 25 శాతం రాయితీ : – 
వాహ‌నాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహ‌కాలు ప్రక‌టించింది. రాష్ర్టంలోనే కొనుగోలు చేసి, రిజిస్ర్టేష‌న్ చేయించుకుంటే ప‌లు రాయితీల‌కు అవ‌కాశం క‌ల్పించింది. మరోవైపు.. పెట్టుబ‌డి మొత్తంలో మెగా ప్రాజెక్టుల‌కు 25 శాతం రాయితీ క‌ల్పించ‌నున్నారు. విద్యుత్ ఛార్జీలు, స్టాంపు, రిజిస్ర్టేష‌న్ ఫీజుల‌పై రాయితీలు ఇవ్వనుంది.




రోడ్ ట్యాక్స్ మినహాయింపు : – 
మరోవైపు… మొద‌టి 2 ల‌క్షల ఎలక్ట్రికల్ బైక్‌లకు రోడ్ ట్యాక్స్ నుంచి మిన‌హాయింపు ఇవ్వనున్నారు. 5 వేల ఫోర్ వీల‌ర్లు, 10 వేల లైట్ గూడ్స్‌, క్యారియ‌ర్‌ల‌కు పూర్తిగా ప‌న్ను ర‌ద్దు చేయ‌నున్నారు. ప్రజా ర‌వాణాలోనూ ఎల‌క్ర్టిక్ వాహ‌నాల వినియోగానికి ప్రభుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. పార్కింగ్‌, ఛార్జింగ్ స‌మ‌స్యల‌కు పరిష్కార మార్గాలు వెత‌క‌నున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేసి ప్రత్యేక ఫీజు వ‌సూలు చేస్తారు. నేషనల్ హైవేలపై ప్రతీ 50 కిలోమీట‌ర్లకు ఒక ఛార్జింగ్ స్టేష‌న్ ఏర్పాటు చేయ‌నున్నారు.