Telangana : ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వారం లేదా 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ మీటింగ్ జరుగుతోంది.

Telangana : ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Assembly (1)

Telangana Assembly sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వారం లేదా 10 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ సన్నద్ధతపైనా కేబినెట్‌ చర్చించింది. రాష్ట్రంలో పంటల సాగు, దిగుబడి అంచనాలపై మంత్రిమండలి సమీక్షించింది.

వానాకాలం పంటల కొనుగోళ్లపై మార్కెటింగ్‌ శాఖ సన్నద్ధతపై చర్చించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రి సత్యవతిరాథోడ్‌ చైర్మన్‌గా, మరో ముగ్గురు మంత్రులతో సబ్‌ కమిటీని నియమించింది. రాష్ట్రంలో హోం శాఖపైనా సమీక్షించింది.

KTR : తెలంగాణ రెండో ఐటీ పాలసీ..10 లక్షల మందికి ఉద్యోగాలు

అంతకుముందు కరోనా పరిస్థితులపై కేబినెట్‌లో చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖపై మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ మంత్రులు సమీక్షించారు. పక్క రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆయా రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై.. సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో స్కూళ్లు పునఃప్రారంభమైన తర్వాత పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ.. కేబినెట్‌కు నివేదికలు అందజేసింది. విద్యాసంస్థలు తెరుచుకున్నా.. కేసులు పెరగలేదని.. రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందంటూ కేబినెట్‌కు వివరించింది.