ఆర్టీసీ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు. జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శులకు..

ఆర్టీసీ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Telangana Cm Kcr Good News For Rtc Employs And Panchayati Secretaries

CM KCR Good News : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు. జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శులకు.. వచ్చే నెల నుంచి ఫుల్ శాలరీ ఇస్తామన్నారు. రెగ్యులర్ కార్యదర్శులతో సమానంగా వేతనాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. అయితే వారి ప్రొబేషన్ పీరియడ్ మాత్రం తీసేయమని, మరో సంవత్సరం పెంచి నాలుగేళ్లు చేస్తామని తెలిపారు.

ఎలాంటి ఒత్తిడి లేదు:
గ్రామంలో మెక్కలు పెంచడం, ఇతర పనులు మంచిగా జరగడమే తమ లక్ష్యమని, వారిని వేధించాలన్నది తమ భావన కాదని సీఎం చెప్పారు. ఈ క్రమంలోనే కార్యదర్శులకు పలు నిబంధనలు విధించామన్నారు. నిబంధనల కారణంగానే గ్రామాల్లో మొక్కల పెంపు కార్యక్రమం ఆశించిన ప్రయోజనాన్ని ఇచ్చిందన్నారు. కార్యదర్శులపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్, హరితహారం మొక్కలు జాగ్రత్తగా కాపాడాలని చెప్పారు. ఒకప్పుడు వీఆర్ఏలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు మాత్రమే ఉండేదన్నారు. ఇప్పుడు వారికి రూ.14 వేల వరకు వేతనాలు అందిస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిని లేకుండా చేయడమే లక్ష్యంగా ధరణి వెబ్ సైట్ ను తెచ్చామన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు త్వరలో పెంచుతాం:
అలాగే, ఆర్టీసీ ఉద్యోగులకు సైతం త్వరలో జీతాలు పెంచుతామని కేసీఆర్ తెలిపారు. పర్మినెంట్ వారితో పాటు తాత్కాలిక ఉద్యోగులకు సైతం వేతనాలు పెంచిన ఘనత తెలంగాణ సర్కార్ కే దక్కుతుందన్నారు. టీఎస్ ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోందని, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పారు. బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.3వేల కోట్లు కేటాయించామని వివరించారు.

ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నాం అన్నారు. ముందు ముందు ఆర్టీసీని ఆదుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అందరికి జీతాలు పెరిగాయి, మాకూ జీతాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారని, సంబంధిత మంత్రితో మాట్లాడి జీతాలు పెంచుతామని కేసీఆర్ చెప్పారు. అంతేకాదు విద్యుత్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా సంకేతాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. విద్యుత్ ఉద్యోగుల జీతాలను పెరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.