Paddy Procurement : మోదీకి సీఎం కేసీఆర్ లేఖ…ధాన్యం కొనుగోళ్లు చేయాలని విజ్ఞప్తి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు.

Paddy Procurement : మోదీకి సీఎం కేసీఆర్ లేఖ…ధాన్యం కొనుగోళ్లు చేయాలని విజ్ఞప్తి

Kcr Letter

Telangana CM KCR : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదిగా ధాన్యం ఎంతకొంటారో చెప్పడం లేదని, వరిసాగు విస్తీర్ణం పెరుగుతున్నా కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదన్నారు. యాసంగిలో ఎంత ధాన్యం కొంటారో స్పష్టం చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై FCIకి ఆదేశాలు ఇవ్వాలని, 2020-21 యాసంగి సీజన్ కు సంబంధించిన..5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.

Read More : Month Salary : నెల తిరగకుండానే..జీతం అయిపోతోంది..సర్వేలో ఆసక్తికర విషయాలు

ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నా..కొనుగోళ్ళు పెరగడం లేదనే అంశాన్ని ప్రస్తావించారు. ఎఫ్ సీఐ విధానంతో పంటల విధానాన్ని వివరించలేకపోతున్నట్లు, 2021 యాసంగిలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని వివరించారు. అందులో 32.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్ సీఐ సేకరించిందని తెలిపారు. 2021 యాసంగిలో 59 శాతం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం సేకరణలో వ్యత్యాసాలతో పంట విధానాలను అమలు చేయండం ఇబ్బందిగా మారిందని లేఖలో వెల్లడించారు.

Read More : YSRCP : వార్ వన్‌సైడ్.. నెల్లూరులో వైసీపీ క్లీన్‌స్వీప్.. 54 డివిజన్లలోనూ ఫ్యాన్ గాలి

లేఖలో ఇంకా ఏం చెప్పారంటే…

‘24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి 10,000 రూపాయల పంటపెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కష్టజీవి అయిన తెలంగాణ రైతు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తున్నాడు. తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఎక్కడ చూసినా తెలంగాణలో కరువు కాటకమే తాండవించేంది. నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన  సాగునీటి లభ్యత ద్వారా,  తెలంగాణ తన అవసరాలను దాటుకుని  ఆహార ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి మీకు తెలియనిది కాదు. సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోదుమలు వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ.. దేశ ప్రజలకు  ఆహార భధ్రతను కల్పించే   తప్పనిసరి బాధ్యతలను నెరవేర్చాల్సిన భారత ఆహార సంస్థ (FCI) అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ, అటు రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తున్నది.

Read More : Delhi Air Pollution: టీవీ డిబేట్స్ కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి: సీజేఐ వ్యాఖ్యలు

FCI అవలంబిస్తున్న అయోమయ విధానాలు
1. ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించడం లేదు.
2. ప్రతి ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నదని తెలిసినా ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదు.
FCI అయోమయ విధానాల వలన సరియైన పంటల విధానాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారింది.
2021 వానాకాలం సీజన్ లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయింది. కానీ అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే ఎఫ్ సి ఐ  సేకరించింది. అంటే పండిన పంటలో కేవలం 59 శాతం ధాన్యం మాత్రమే. ఇది 2019 -20 వానాకాలంలో  సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువ. ధాన్యం సేకరణలో ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో  హేతుబద్దమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బందిగా మారుతుంది.

Read More : Cab Driver :  క్యాబ్‌ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించిన మహిళ

ఇటువంటి అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణ లో నిర్థిష్టమైన  లక్ష్యాన్ని నిర్దారించడం కోసం కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ని సెప్టెంబర్ 25, 26 తారీఖుల్లో నేనే స్వయంగా వెల్లి కలిసాను. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్దారించాలని నేను విజ్జప్తి చేశాను. కేంద్ర మంత్రికి విజ్జప్తి చేసి 50 రోజులు దాటిపోయినా ఎటువంటి సమాచారం లేదు, ఇంతవరకు ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు. ఈ నేపథ్యంలో.. FCIకి ఈ కింది ఆదేశాలు ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.
1.  2020- 21 ఎండాకాలం సీజన్లో సేకరించకుండా మిగిలి ఉంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలి.
2. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమనే నిబంధనను మరింతగా పెంచి, పంజాబ్ రాష్ట్రంలో మాదిరి  తెలంగాణలో కూడా ఈ 2021 -22 వానాకాలంలో పండిన పంటలో 90 శాతం వరి ధాన్యాన్ని సేకరించాలి.
3. వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్దారించాలి.
ఇందుకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని నేను విజ్జప్తి చేస్తున్నాను’. అని లేఖలో తెలిపారు సీఎం కేసీఆర్.