Governor Tamilisai : బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళిసై.. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి నిర్వహించారు. ఆదివారం ట్రిపుల్ ఐటీకి వెళ్లిన గవర్నర్.. మెస్, హాస్టల్ ను పరిశీలించారు. సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్ వాపోయారు. ఇక భోజనం విషయంలో విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు.

Governor Tamilisai : బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళిసై.. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ

Governor Tamilisai : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి నిర్వహించారు. ఆదివారం ట్రిపుల్ ఐటీకి వెళ్లిన గవర్నర్.. మెస్, హాస్టల్ ను పరిశీలించారు. సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్ వాపోయారు. ఇక భోజనం విషయంలో విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు.

విద్యార్థుల కష్టాలు తెలుసుకునేందుకు ఓ తల్లిగా తాను వచ్చానని గవర్నర్ తమిళిసై అన్నారు. ఎక్కడా ప్రొటోకాల్ అమలు కావడం లేదన్నారు. మెస్, హాస్టల్ ను పరిశీలించానని.. విద్యార్థుల సమస్యలపై అధికారులతో మాట్లాడానని, సమస్యలు పరిష్కరిస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పిందని తమిళిసై వెల్లడించారు.

Basara IIIT Staff Bath : బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం.. వంట గదిలోనే సిబ్బంది స్నానాలు.. వీడియో వైరల్

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బాసర ట్రిపుల్‌ విద్యార్థులు, అధికారులతో ముఖాముఖి సమావేశమై చర్చించారు. ట్రిపుల్‌ ఐటీలో హాస్టల్‌, మెస్‌, ల్యాబ్‌, లైబ్రరీని ఆమె పరిశీలించారు. ట్రిపుల్‌ ఐటీలో ప్రత్యక్షంగా పరిశీలిస్తూ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తమ బాధలను గవర్నర్‌కు వివరించారు.

రెగ్యులర్‌ వీసీ, అధ్యాపకుల నియమాకం, ల్యాబ్‌, హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్ధులు గవర్నర్ కు విన్నవించారు. మెస్‌ టెంబర్లు రద్దు చేయాలని, ఫుడ్‌పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు సమస్యలతో బాధపడుతున్నారని వాపోయిన గవర్నర్ తమిళిసై.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మెస్‌ నిర్వహణపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారని, సానుకూల ధృక్పథంతో సమస్యలను పరిష్కరించాలని వర్సిటీ అధికారులను కోరారు గవర్నర్ తమిళిసై.

Basara IIIT : రంగంలోకి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు.. మంత్రి సబితకు వార్నింగ్

ఒకటి రెండు కాదు ఒకదాని వెనుక మరొకటి వరుసగా సమస్యలు బాసర ట్రిపుల్ ఐటీని పీడిస్తున్నాయి. విద్యావ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. తమ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలంటూ జూన్ 14 నుంచి 21వ తేదీ వరకు ఎండనక వాననక ఉద్యమించారు విద్యార్థులు. చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి వచ్చారు. నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

అయితే రెండు నెలలు కావొస్తున్నా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు విద్యార్థులు. అంతేకాదు ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు కూడా జరిగాయని వాపోతున్నారు. దీంతో ఈ నెల 3న విద్యార్థులు గవర్నర తమిళిసైని కలిశారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఒక్కసారి వర్సిటీకి వచ్చి చూడండి మేడమ్ అంటూ గవర్నర్ ను ఆహ్వానించారు. దీంతో గవర్నర్ తమిళిసై రంగంలోకి దిగారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా వర్సిటీకి వెళ్లారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను విజిట్ చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇక ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ట్రిపుల్ ఐటీకి అనుకున్న స్థాయిలో నిధులు రాకపోవడంతో పాటు న్యాక్ నుంచి సీ గ్రేడ్ రావడంతో విద్యార్థులు నిరాశపడ్డారు. వీటికి తోడు పురుగుల అన్నం, కప్పల కూరలు, టిఫిన్ లో బల్లులు, బొద్దింకలు రావడం విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించాయి. జులై 15న ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. మెస్ సిబ్బంది వంటగదినే బాత్ రూమ్ మార్చుకున్నారు. ఏకంగా వంట గదిలోనే సిబ్బంది స్నానాలు చేస్తున్న వీడియోలు బయటపడ్డాయి. ఈ ఒక్కటి చాలు ట్రిపుల్ ఐటీలో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో చెప్పడానికి అని విద్యార్థులు అంటున్నారు.