Private Hospitals : ప్రైవేట్‌లో మళ్లీ టీకాలకు ప్రభుత్వం అనుమతి, ఆ కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని ఆదేశం

కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకునే విషయంలో ప్రైవేటు హాస్పిటల్స్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి బాధితులను ఆసుపత్రిలో చేర్చుకోవాలో స్పష్టం చేసింది. తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని తేల్చి చెప్పింది. ఆక్సిజన్‌ లెవెల్స్ 94 శాతం కంటే ఎక్కువ ఉంటే అలాంటి వారిని ఆసుపత్రిలో చేర్చుకోకుండా హోం ఐసోలేషన్‌లో ఉంచాలంది.

Private Hospitals : ప్రైవేట్‌లో మళ్లీ టీకాలకు ప్రభుత్వం అనుమతి, ఆ కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని ఆదేశం

Private Hospitals

Private Hospitals : కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకునే విషయంలో ప్రైవేటు హాస్పిటల్స్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి బాధితులను ఆసుపత్రిలో చేర్చుకోవాలో స్పష్టం చేసింది. తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని తేల్చి చెప్పింది. ఆక్సిజన్‌ లెవెల్స్ 94 శాతం కంటే ఎక్కువ ఉంటే అలాంటి వారిని ఆసుపత్రిలో చేర్చుకోకుండా హోం ఐసోలేషన్‌లో ఉంచాలంది.

అలాగే ఆసుపత్రుల్లో పడకల సంఖ్య వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని ప్రైవేట్ హాస్పిట్స్ యాజమాన్యాలను ప్రభుత్వం కోరింది. అటు కొవిడ్‌ చికిత్సకు అనుమతులు లేని ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ కష్టకాలంలో ఆసుపత్రి యాజమాన్యాలు రోగులను ఇబ్బందికి గురి చేయకుండా మానవత్వంతో వ్యవహరించి చికిత్స అందించాలని ప్రభుత్వం సూచించింది.

ప్రైవేటులో మళ్లీ వ్యాక్సినేషన్ కు అనుమతి:
రోజు రోజుకీ కరోనా వైరస్‌ ఉద్ధృతమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ మళ్లీ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. వ్యాక్సినేషన్ కు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 45 ఏళ్లు పైబడి వాళ్లకే, అదీ కొవిన్‌ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని చెప్పింది. అయితే, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు లేదా ఆస్పత్రులకు ప్రభుత్వం ఎలాంటి వ్యాక్సిన్‌ సరఫరా చేయదు. వారే సొంతంగా తయారీ కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ, అందుకు తగ్గట్టుగా రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా లేదు. ఇప్పటికే వేలాది మంది వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో ప్రైవేటు హాస్పిటళ్లకు కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం నిలిపివేసింది.