ఎర్రరాయితో సచివాలయం, రాజస్థాన్ కు వెళ్లనున్న మంత్రి వేముల బృందం

ఎర్రరాయితో సచివాలయం, రాజస్థాన్ కు వెళ్లనున్న మంత్రి వేముల బృందం

Telangana Secretariat Construction : తెలంగాణ నూతన సచివాలయాన్ని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. దీంతో డిజైన్‌ బయట, లోపల అంతర్గతంగా చిన్నచిన్న మార్పులు జరిగాయి. దేశంలోని పలుప్రాంతాల నుంచి రకరకాల రాయిని తెప్పించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నిర్మాణానికి వాడనున్న ఎర్రరాయిని పరిశీలించేందుకు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం 2021, ఫిబ్రవరి 19వ తేదీ శుక్రవారం ఢిల్లీలో పర్యటించింది. శని, ఆదివారాల్లో రాజస్థాన్‌లోని పలు క్వారీలను పరిశీలించనున్నది. పార్లమెంట్‌ను సందర్శించి నిర్మాణానికి వాడిన రెడ్‌స్టోన్‌ను పరిశీలించింది.

రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌గార్డెన్‌, అశోకాహాల్‌ను సందర్శించింది. ఆయా నిర్మాణాలకు వాడిన రాళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అధికారులు. ఎర్రరాయి దొరికే క్వారీలను పరిశీలించేందుకు వేముల బృందం శనివారం రాజస్థాన్‌లో పర్యటించనున్నది. రాష్ట్రపతి భవన్‌, పార్లమెంట్‌, నార్త్‌-సౌత్‌బ్లాక్‌లకు వాడిన ఎర్రరాయి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌, కైరోలి ప్రాంతాల్లోని క్వారీల్లో దొరుకుతుంది. బృందంలోని సభ్యులు ఆయా క్వారీల్లో రాయిని పరిశీలించి, అవసరమైన రాయి గురించి యజమానులతో చర్చించనున్నారు.

మరోవైపు..ఢిల్లీ పర్యటనలో భాగంగా..మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డది కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శఇ గిరిధర్ అరమనేతో భేటీ అయ్యారు. పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులను మంజూరు చేయాలని కోరారు. ఇదివరకే పంపించిన ప్రతిపాదనల మేరకు జాతీయ రహదారులను, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు.