TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

టెట్ పేప‌ర్ -1లో 32.68 శాతం, పేప‌ర్-2లో 49.64 శాతం మంది అభ్య‌ర్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. అభ్యర్థులు www.tstet.cgg.gov.in వెబ్‌‌సై‌ట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు.

TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

Telangana TET : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(‌టెట్‌) ఫలి‌తాలు విడుదల అయ్యాయి. టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ఫలితాలను శుక్ర‌వారం(జులై1,2022) విడుదల చేశారు. టెట్ పేప‌ర్ -1లో 32.68 శాతం, పేప‌ర్-2లో 49.64 శాతం మంది అభ్య‌ర్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. అభ్యర్థులు www.tstet.cgg.gov.in వెబ్‌‌సై‌ట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు.

గత నెల 12న టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో పేపర్‌-1 పరీక్షను 3,18,506 (90.62 శాతం), పేపర్‌-2 పరీక్షను 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు రాశారు.