Huzurabad : హుజూరాబాద్‌ నామినేషన్‌ సెంటర్‌ దగ్గర ఉద్రిక్తత

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు.

Huzurabad : హుజూరాబాద్‌ నామినేషన్‌ సెంటర్‌ దగ్గర ఉద్రిక్తత

Tension

Tension near Nomination Center : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో.. ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా నామినేషన్లు వేయకుండా తమను అధికారులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేసేందుకు లోపలికి వెళ్లారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు.

ఇక కాసేపట్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు. ఈటల నామినేషన్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ నామినేషన్‌ వేశారు. హుజూరాబాద్‌లో నామినేషన్‌ రాజకీయం వేడెక్కింది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడం కోసం అభ్యర్ధులు బారులు తీరారు.

Huzurabad By-Election : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు..నామినేషన్లు వేసేందుకు వందలాదిగా తరలొచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు

దీంతో హుజూరాబాద్‌ నామినేషన్‌ సెంటర్‌ వద్ద రద్దీ నెలకొంది. నామినేషన్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఫీల్డ్‌ అసిస్టెంట్లు తరలివచ్చారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు లైన్‌ కట్టారు. అయితే కోవిడ్‌ నిబంధనలు, వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ కావాలి అంటూ అధికారులు రూల్స్‌ పెట్టారు. నామినేషన్‌ వేయడానికి రూల్స్ అడ్డుపడుతున్నాయి. ఈ నెల 11న ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత 4 రోజులుగా నామినేషన్ పత్రాలతో వస్తున్నా తమను అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఇవాళ కూడా నామినేషన్ వేసేందుకు ఫీల్డ్ అసిసెంట్లు భారీ ఎత్తున తరలివచ్చారు.