Corona Doctors : డాక్టర్లను వెంటాడుతున్న కరోనా.. ఉస్మానియాలో 159, గాంధీలో 120 మందికి పాజిటివ్

గాంధీ ఆస్పత్రిలో 120మంది వైద్యులకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఉస్మానియా ఆస్పత్రిలో 159మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. కేసులు పెరుగుతుంటే ఆస్పత్రి వర్గాలు ఆందోళ చెందుతున్నాయి.

Corona Doctors : డాక్టర్లను వెంటాడుతున్న కరోనా.. ఉస్మానియాలో 159, గాంధీలో 120 మందికి పాజిటివ్

Doctor Corona

Corona positive for doctors : తెలంగాణను ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తుండగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పెద్దాసుపత్రుల్లో వైద్యులను కూడా వైరస్ వెంటాడుతోంది. కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాక్టర్లు సైతం వైరస్ బారిన పడుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో 120 మంది వైద్యులకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఉస్మానియా ఆస్పత్రిలో 159మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. కోవిడ్ కేసులు పెరుగుతుంటే ఆస్పత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రీట్ మెంట్ చెయ్యాల్సిన వైద్యులకు పాజిటివ్ గా నిర్ధారణ అవుతుంటే… టెన్షన్ పెరుగుతోంది.

రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కు సంబంధించిన పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ రెండు కలిపి ఒకటే బులిటెన్ లో ఇవ్వడంతో ఏ వేరియంట్ సోకిందో తెలియని పరిస్థితి ఉంది. పూర్తిగా నాన్ కోవిడ్ సేవలందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రిలో నేటికి జూనియర్ డాక్టర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, సీనియర్ రెసిడెన్స్, అలాగే మిగతా డాక్టర్లతోపాటు ప్రొఫెసర్స్ కు కలిపి మొత్తం 150 మందికి కరోనా సోకడం కలవరం నెలకొంది.

Minister Harish Rao : రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది : మంత్రి హరీష్ రావు

ఇటు గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్ మెంట్ ఇస్తున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా వేలాది మంది కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లలో 120 మందికి వైరస్ సోకింది. జూనియర్, సీనియర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కలిపి మొత్తం 120 మంది డాక్టర్లకు పాజిటివ్ రావడం ఆందోళన కలిగించే విషయంగా చెప్పవచ్చు.

ఇప్పటికే గాంధీలో నిన్నటికి నిన్న 39 పాజిటివ్ కేసులు అడ్మిట్ అయ్యారు. అంతకముందు వందకు పైగా పాజిటివ్ కేసులు ఉండటంతో ఇప్పటికే ఆస్పత్రిలో 150 పాజిటివ్ కేసులకు చేరువలో ఉన్నాయి. వారికి ట్రీమ్ మెంట్ తరుణంలో డాక్టర్లకు వైరస్ సోకుతోంది. మరోవైపు నాన్ కోవిడ్ సేవలు అందిస్తున్న డాక్టర్లుకు కూడా వైరస్ సోకడంతో కలవరపెడుతోంది. ట్రీట్ మెంట్ ఇచ్చే క్రమంలో వీరికి వైరస్ ఎటాక్ అయితే కొంత ఆందోళన పెరుగుతుంది.

Corona Positive : కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో 70 మంది విద్యార్థులకు కరోనా.. అయినా ఎగ్జామ్స్ కు హాజరుకావాలని ఆదేశాలు

రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు పెరిగుతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్ వణికిస్తున్నాయి. నిన్న 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా… 2,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఇక విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని కేటినెట్ కు మంత్రి హరీశ్ రావు వివరించారు. రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కో్ట్ల కరోనా టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

Nara Lokesh Corona : టీడీపీ నేత నారా లోకేష్ కు కరోనా పాజిటివ్

అర్హులందరికీ త్వరగా వ్యాక్సిన్లు ఇస్తామని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. స్వీయ నియంత్రణ ద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చని చెప్పారు. ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.