Minister ktr: శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం

శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ హెచ్ఐసీసీలో మెడిక‌ల్ డివైజెస్, ఇంప్లాంట్స్‌లో 3డీ ప్రింటింగ్‌పై జ‌రిగిన జాతీయ స‌ద‌స్సులో...

Minister ktr: శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం

Minister Ktr (1)

Minister ktr: శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ హెచ్ఐసీసీలో మెడిక‌ల్ డివైజెస్, ఇంప్లాంట్స్‌లో 3డీ ప్రింటింగ్‌పై జ‌రిగిన జాతీయ స‌ద‌స్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో వివిధ సంస్థ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వంతో అవ‌గాహ‌న ఒప్పందాలు చేసుకున్నాయి. అనంతరం మంత్రి మాట్లాడారు.. 3డీ ప్రింటింగ్ ఆరోగ్య విభాగంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇప్పటికే టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

టీ‌వర్క్స్ ద్వారా అనేక ప్రోటో టైప్స్ రూపొందిస్తున్నామని అన్నారు. 3డీ ప్రింటింగ్ మార్కెట్ 2020లో 1.7 బిలియన్ డాలర్లు ఉందని, 2027 నాటికి అది ఏడు బిలియన్ డాలర్లకు పెరుగుతుందని, ఏడాదికి 23.2శాతం మార్కెట్ పెరుగుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థోపెడిక్, డెంటల్ విభాగాల్లో 3డీ ప్రింటింగ్ కీలక పాత్ర పోషించనుందని, ఈ టెక్నాలజీ ఎక్కువగా యుఎస్, యూరోపియన్ మార్కెట్ లలో ఎక్కువగా ఉందని, భారత్ ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని మంత్రి తెలిపారు. 3డీ టెక్నాలజీ సహాయంతో రోగులకు వ్యక్తిగతంగా అవసరమైన సైజ్ లలో ఇంప్లాంట్స్‌ని తయారు చేసే అవకాశముందని కేటీఆర్ తెలిపారు. ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అడిట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సెంట‌ర్‌తో ఈ రంగంలో దేశం పురోగ‌తి సాధిస్తుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.