Child Murder : రూ.50 వేల తక్షణ ఆర్థికసాయాన్ని నిరాకరించిన హత్యాచార బాలిక కుటుంబం

హత్యాచార బాలిక కుటుంబానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ తక్షణ పరిహారం కింద రూ.50 వేల చెక్‌ ను అందజేశారు. రూ.50 వేల తక్షణ ఆర్థిక సాయాన్ని బాధిత బాలిక కుటుంబం నిరికారించింది.

Child Murder : రూ.50 వేల తక్షణ ఆర్థికసాయాన్ని నిరాకరించిన హత్యాచార బాలిక కుటుంబం

Family Refuse

family refused financial assistance : హైదరాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ పరిహారం కింద 50 వేల రూపాయల చెక్‌ కలెక్టర్ శర్మన్ అందజేశారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని… అలాగే బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, అవుట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబంలోని పిల్లలకు మోడల్ స్కూల్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తామని కలెక్టర్ శర్మన్ హామీ ఇచ్చారు.

వీలైనంత తొందరగా చట్ట ప్రకారం నిందితునికి శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. సింగరేణి కాలనీలో బెల్ట్ షాప్స్, గుడుంబా లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే కలెక్టర్ అందజేసిన రూ.50 తక్షణ ఆర్థిక సాయాన్ని బాధిత బాలిక కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో కలెక్టర్ శర్మన్ వెనుతిరిగారు.

ధర్నా చేస్తున్న వారిని జిల్లా కలెక్టర్ శర్మన్ తోపాటు ఈస్ట్‌ జోన్ డీసీసీ రమేష్ పరామర్శించారు. ఈ ఘటన జరగడం దురదృష్టమని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి అన్నారు. పాప డెడ్ బాడీ తరలించే టైం లో పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. పాప డెడ్ బాడీకి ఉస్మానియా హాస్పిటల్ లో పోస్ట్ మార్టం జరుగుతోందన్నారు. మరో రెండు గంటల్లో నిందితున్ని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి తొందరగా శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.

మరోవైపు చిన్నారి ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సింగరేణి కాలనీ వాసులు ఆందోళనకు దిగారు.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.. వాహనాలను అడ్డుకున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి బాలిక ఆచూకి కనిపించలేదు. ఎంత వెతికినా ఆచూకి లభించకపోవడంతో కుటుంబసభ్యులకు ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు.

కానీ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలుకొట్టి మరీ పాప కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు ..రాజు ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. పాప అక్కడ విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేష్‌ నేతృత్వంలో విచారణ సాగుతోంది. నిందితుడి కోసం 10 పోలీస్‌ బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.