Telangana Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ జారీ

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వానలు పడతాయని పేర్కొంది.

Telangana Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ జారీ

Telangana Rains (1)

Rains In Telangana  : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వానలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగుతోపాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, హన్మకొండ, జనగాం సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక పలు జిల్లాలకు వాతావారణ శాఖ ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది.

Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లపై వర్షపు నీరు, లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రహదారులపై భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లతున్నాయి. నగరంలోని పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

ముఖ్యంగా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో అధికంగా వర్షపాతం నమోదు అయింది. దాంతో పాటు సికింద్రాబాద్ జోన్ ఉండే అంబర్ పేట్ లో వర్షం కురిసింది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 4 నుంచి 5 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదు కాగా, అంబర్ పేటలో 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

South West Monsoon : బ్యాడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు తక్కువే, ఆ 2నెలలు కరవుకు అవకాశం

శేరిలింగంపల్లి, చందానగర్, మాదాపూర్ గచ్చిబౌలిలో 4 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. అమీర్ పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, సైదాబాద్, మాదన్నపేట, బహదూర్ పురా, చంద్రాయణగుట్ట, సంతోష్ నగర్, శాలిబండతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.