Special Buses : అదనపు చార్జీలు లేకుండా సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

అయితే ఈసారి చార్జీల విషయంలో ప్రయాణికులకు ఆర్టీసీ కాస్త ఊరట నిచ్చింది. పండుగకు తిప్పే స్పెషల్‌ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది.

Special Buses : అదనపు చార్జీలు లేకుండా సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

Trc Bus

special buses to Sankranthi festival : సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం టీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు నడుపుతోంది. ఇవాళ్టి నుంచే ఈ బస్సులను ప్రారంభించింది. ఈ నెల 15 వరకు స్పెషల్‌ బస్సులను తిప్పనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. సంక్రాంతి పండుగకు మొత్తం 4వేల 318 బస్సులను టీఎస్‌ ఆర్టీసీ నడపనుంది.

అయితే ఈసారి చార్జీల విషయంలో ప్రయాణికులకు ఆర్టీసీ కాస్త ఊరట నిచ్చింది. పండుగకు తిప్పే స్పెషల్‌ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించే అవకాశముంది. పండుగ కోసం ఊళ్లకు వెళ్లేవారిని తమ బస్సుల్లో ఎక్కించేలా ఆర్టీసీ ప్లాన్‌ చేసింది.

Life Sentence : 12 మంది బాలికలపై అత్యాచారం చేసిన యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష

సంక్రాంతికి తెలంగాణలోని వివిధ జిల్లాలకు 3వేల 334 స్పెషల్‌ బస్సులను నడపనుంది. ఇక ఏపీకి మరో 984 సర్వీసులు తిప్పనుంది. ఏపీకి తిప్పే బస్సుల్లోనూ సాధారణ చార్జీలే వసూలు చేయనుంది. మరోవైపు ఇప్పటికే పండుగకు అదనపు చార్జీలు వసూలు చేస్తామని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది.

ఇటు తెలంగాణ ఆర్టీసీ మాత్రం సాధారణ చార్జీలనే వసూలు చేస్తామని చెబుతోంది. దీంతో సంక్రాంతి పండుగను కుటుంబంతో జరుపుకోవడానికి సొంతూళ్లకు వెళ్లే ఏపీ ప్రజలు కూడా టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశముంది.