Hanumantha Rao: 25కోట్లు తీసుకున్నారని విషప్రచారం చేస్తున్నారు.. ఖమ్మంలో నిరుద్యోగ ర్యాలీని విజయవంతం చేయాలి

నిరుద్యోగ సమస్యపై 24న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ, దీక్షను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు.

Hanumantha Rao: 25కోట్లు తీసుకున్నారని విషప్రచారం చేస్తున్నారు.. ఖమ్మంలో నిరుద్యోగ ర్యాలీని విజయవంతం చేయాలి

V.Hanumantha Rao

Hanumantha Rao: నిరుద్యోగ సమస్యపై 24న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ, దీక్షను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు. ఖమ్మం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యలపై రేవంత్ రెడ్డి, ప్రజల సమస్యలపై భట్టి విక్రమార్క యాత్రలు చేస్తున్నారని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని అన్నారు. నిరుద్యోగ సమస్య పై సోమవారం రేవంత్ రెడ్డి నిరుద్యోగ మార్చ్ చేసేందుకు ఖమ్మం వస్తున్నాడని, భారీ సంఖ్యలో నిరుద్యోగులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని వీహెచ్ కోరారు.

Revanth Reddy: భాగ్యలక్ష్మి అమ్మవారిపై రేవంత్ రెడ్డి ప్రమాణం.. ఈటలపై భావోద్వేగభరిత వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లాకు చెందిన నేత అయిన భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉండటం వల్ల సోమవారం జరిగే కార్యక్రమంకు హాజరుకాలేక పోతున్నాడని వీహెచ్ అన్నారు. దానిని రాజకీయం చేయొద్దని వీహెచ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ఖమ్మం జిల్లా గుర్తుకు వచ్చేదని, మళ్లీ ఆ స్థాయిలో పూర్వవైభవం తెచ్చేలా జిల్లాలోని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు కృషి చేయాలని వీహెచ్ కోరారు.

Revanth Challenged Etala : చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు రావాలని రేవంత్ సవాల్.. సవాళ్లపై స్పందించ వద్దని ఈటల నిర్ణయం

రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయవు కానీ దొంగలకు మాత్రం 80వేల కోట్ల మాఫీ చేస్తావా అంటూ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకివస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి.. ఆ ఉద్యోగాలు ఎటుపోయాయి అంటూ వీహెచ్ ప్రశ్నించారు. ఓబీసీలకు రిజర్వేషన్ పెంచేందుకు రాహుల్ గాంధీ కృషి చేస్తున్నాడని 2008లో రాజ్నాథ్ సింగ్ అన్నమాటను వీహెచ్ గుర్తు చేశారు. కేవలం కుట్రతోనే రాహుల్‌ను పార్లమెంట్ నుంచి బయటకు పంపారని వీహెచ్ కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు.

Amit Shah : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. తెలంగాణకు రానున్న అమిత్ షా

మునుగోడు ఉప ఎన్నికల్లో 25కోట్లు తీసుకున్నారని విషప్రచారం చేస్తున్నారని, అసత్యాలతో ప్రజలను నమ్మించాలని చూస్తే ప్రజలు అమాయకులు కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని బీజేపీ నేతలకు వీహెచ్ సూచించారు. మరో మూడు నెలల్లో ఎన్నికలున్నాయని చెప్పిన వీహెచ్.. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందేమోనన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతుల పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని వీహెచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు.