G Kishan Reddy: కేసీఆర్, కేటీఆర్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్..రాష్ట్రం మొత్తం తన గుప్పిట ఉంచుకోవాలని చూస్తున్నారని, ఆయనను తెలంగాణ సమాజం చీదరించుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు.

G Kishan Reddy: కేసీఆర్, కేటీఆర్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan

G Kishan Reddy: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక వైఫల్యాలు ఉన్నాయని..తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్, కేటీఆర్ కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర – 2 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో బీజేపీ నేతలు భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపధ్యంలో హైదరాబాద్ తుక్కుగూడలో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ యాత్రకు తెలంగాణలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని ఆయన అన్నారు. ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారని..టీఆర్ఎస్ పార్టీ ప్రజావ్యతిరేక, అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అమిత్ షా ప్రసంగం ఉండబోతోందని కిషన్ రెడ్డి చెప్పారు.

Read Others: Telangana : ఆస్పత్రిలోనే అనుమానాస్పదంగా మృతి చెందిన డాక్టర్ శ్వేత

తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పేరు గొప్ప ఊరు దిబ్బగా ఉందని ఆయన అన్నారు. కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్..రాష్ట్రం మొత్తం తన గుప్పిట ఉంచుకోవాలని చూస్తున్నారని, ఆయనను తెలంగాణ సమాజం చీదరించుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలను ఎవరూ ఎక్కువ రోజులు మోసం చేయలేరని, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు..పార్లమెంట్, హుజూరాబాద్..దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి రుచి చూపించారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత గుర్తించిన కేసీఆర్.. ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తానంటూ కొత్త రాగం అందుకున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

read Others:Andhra pradesh : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..YCP తరపున రాజ్యసభకు వెళ్లేదెవరు?

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చన్న కిషన్ రెడ్డి..కేసీఆర్, కేటీఆర్ బీజేపీ పై విషం కక్కుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించామని ఆయన న్నారు. త్వరలో దేశంలో పేద ప్రజలకు అధిక శాతం విటమిన్లతో కూడిన బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. పేద ప్రజల కోసం పోషకాలతో కూడిన బియ్యం అందించేందుకు ఫోర్ బాయిల్డ్ రైస్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ కొనాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

Read Other:Nizamabad Politics : నిజామాబాద్ ఎంపీ పాలిటిక్స్..రంగంలోకి దిగిన ఎంపీ కవిత..ఎంపీ అర్వింద్ పై టార్గెట్

మిగులు ధాన్యం ఉన్నా రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోలు చేస్తున్నాట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం..ఇతర దేశాల కంటే ఉత్తమ ఆర్థిక వ్యవస్థతో దేశాన్ని నడిపిస్తోందని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని, జీ 20 దేశాల కాన్ఫరెన్స్ కు భారత దేశం వేదిక కాబోతోందని కిషన్ రెడ్డి వివరించారు.