V Hanumantha Rao: జైలు ముందు వీహెచ్ ధర్నా.. మరో నయీమ్ తయారయిండని కామెంట్స్

రైతులు ఏమైనా దొంగలా అని వీహెచ్ ప్రశ్నించారు.? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు.

V Hanumantha Rao: జైలు ముందు వీహెచ్ ధర్నా.. మరో నయీమ్ తయారయిండని కామెంట్స్

Vh

V Hanumantha Rao – Bhuvanagiri: తెలంగాణలోని భువనగిరి సబ్ జైలు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ధర్నాకు దిగారు. జైల్లో రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులను పరామర్శించేందుకు వీహెచ్ వెళ్లారు. జైలు అధికారులు అనుమతి నిరాకరించడంతో వీహెచ్ ధర్నా చేయాల్సి వచ్చింది.

రియల్టర్ల కోసం పాత అలైన్మెంట్ మార్చి రాయగిరి మీదుగా ఎమ్మెల్యే రింగ్ రోడ్ తెచ్చారని వీహెచ్ అన్నారు. “భువనగిరి నయీమ్ ను చంపేశారు. ఇక్కడ శాసన సభ్యుడు మరో నయీమ్ గా తయారు అయిండు. నయీమ్ ఉంటే మీరు రాకపోతుండే.. మేమూ రాకపోతుండే. మహారాష్ట్రలో కిసాన్ సర్కార్ అంటూ ఇక్కడనేమో రైతులను జైలులో పెట్టారు కేసీఆర్.

కేసీఆర్ అన్నీ అబద్ధాలు చెబుతుండు. రైతుల పక్షాన ఉంటారా? వెంచర్ల పక్కన ఉంటారా? అని కేసీఆర్ ను అడుగుతున్నా. రైతులు ఏమైనా దొంగలా? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఏంటి? బీసీ గర్జన పెట్టి కేసీఆర్ మోసాలను బయట పెడతాం. కేసీఆర్ ఎన్నికల ముందు బీసీ బంధు అంటే ఎవరూ నమ్మరు” అని వీహెచ్ విమర్శలు గుప్పించారు.

YS Sharmila : ‘మేము కేసీఆర్ తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోం’ : వైఎస్ షర్మిల