గ్రేటర్ ఎన్నికలు : ఓటర్ అకౌంట్స్ కు మనీ ట్రాన్స్ ఫర్

గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పద్దతులు పాటిస్తున్నారు. ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. 2020, డిసెంబర్ 01వ తేదీ మంగళవారం..గ్రేటర్

గ్రేటర్ ఎన్నికలు : ఓటర్ అకౌంట్స్ కు మనీ ట్రాన్స్ ఫర్

Telangana Voter

Voter And Leader Audio Call Leak  : గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పద్దతులు పాటిస్తున్నారు. ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. 2020, డిసెంబర్ 01వ తేదీ మంగళవారం..గ్రేటర్‌లో పోలింగ్‌ జరుగనుంది. ఈ దీంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ఓటర్లను మద్యం, మనీతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు.



గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచడం అభ్యర్థులకు కష్టంగా మారింది. పోలీసులు అడుగడుగునా నిఘా పెట్టడంతో కష్టతరమైపోయింది. దీంతో అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఏకంగా ఓటర్ల అకౌంట్స్‌కు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసేస్తున్నారు. ఓ క్యాండిడేట్ ఏకంగా ఓటరకు 5వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. జగద్గిరిగుట్ట డివిజన్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.



ఓటర్‌కు డబ్బులు వేసినట్టు బూత్‌ కమిటీ ఇంచార్జ్‌ ఓటరకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఓటర్‌ స్లిప్పులు చూసి అకౌంట్స్‌కు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు చెప్పుకొచ్చాడు. డబ్బులు వేసినందున పక్కాగా ఓటు తమకే వేయాలని కోరాడా బూత్‌ ఇంచార్జ్‌…



కట్టుదిట్టమైన భద్రత :
GHMC ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఎన్నికల కోసం 13 వేల 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం అన్ని ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి వాటిని ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా అనుసంధానం చేశామన్నారు సీపీ.



జియో ట్యాగింగ్ :
జియో ట్యాగింగ్‌ ద్వారా ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని అనుసంధానం చేశామన్నారు సీపీ సజ్జనార్ . దాదాపు లక్ష కెమెరాల ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను మానిటరింగ్ చేశామన్నారు. ఎన్నికల అనంతరం కూడా లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద నిఘా పెడతామన్నారు. ఓటర్లు ఎన్నికల గైడ్‌లైన్స్‌, కరోనా నిబంధనలు పాటిస్తూ.. తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.