CP Ranganath : పోలీస్ పోస్టింగ్స్ పై ప్రభుత్వ నివేదిక కోరిన ఈసీ.. వరంగల్ సీపీ రంగనాథ్ వివరణ
పోలీస్ పోస్టింగ్ లలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, స్వార్థం లేదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి, మార్గదర్శకాలకు కట్టుబడే పోస్టింగ్స్ ఇచ్చామని తెలిపారు.

Warangal CP Ranganath
CP Ranganath explanation EC : వరంగల్ జిల్లాలో పోలీస్ పోస్టింగ్స్ వివాదాస్పదమవుతోంది. వరంగల్ కమిషనరేట్ లో 21 మంది పోలీస్ అధికారుల పోస్టింగ్ పై ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్ నివేదిక కోరింది. సర్వీస్, బదిలీలు, పోస్టింగ్స్ పై విచారణ జరిపి నేవేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.
Road Accident: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది పోస్టింగ్ లపై నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో వరంగల్ సీపీ రంగనాథ్ ఈసీకి వివరణ ఇచ్చారు. పోలీస్ పోస్టింగ్ లలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, స్వార్థం లేదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి, మార్గదర్శకాలకు కట్టుబడే పోస్టింగ్స్ ఇచ్చామని తెలిపారు.