maoist leader గణపతి ఎక్కడున్నాడు

  • Published By: madhu ,Published On : September 3, 2020 / 11:37 AM IST
maoist leader గణపతి ఎక్కడున్నాడు

మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడున్నాడు ? ఆయన ఆరోగ్యం క్షీణించిందా ? త్వరలోనే లొంగిపోతాడా ? తదితర అంశాలపై తెగ చర్చ జరుగుతోంది. తెలంగాణ పోలీసుల సహకారంతో కేంద్రంతో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాలపై మావోయిస్టు పార్టీ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.



ఆయన లొంగుబాటు అనేది మాములు విషయం కాదని పరిశీకులు వెల్లడిస్తున్నారు. గణపతి లొంగిపోవడం విషయంలో…అతనిపై ఉన్న కేసులను తెలంగాణ సర్కార్ మాఫీ చేసినా..మిగిలిన 12 రాష్ట్రాల పోలీసులు కేసుల ఎత్తివేతకు ఒకే చెబుతారా ? ఎన్,ఐ.ఏ, రా వంటి సంస్థల విచారించకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
https://10tv.in/telangana-dgp-mahender-reddy-visits-agency-area/
ఈ కేసులన్నీ ఎత్తేయాలంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. పీపుల్స్‌ వార్‌ గ్రూపు (PWG), మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా(MCCI) విలీనంలో గణపతి కీలక పాత్ర పోషించారు. 13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతని కోసం జాతీయ దర్యాప్త సంస్థ(NIA), రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌(R) వంటి జాతీయ దర్యాప్తు సంస్థలు వెదుకుతున్నాయి.



ఆయన లొంగిపోతే..స్వాగతిస్తామని ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని పోలీసులు అంటున్నారు. అయితే..పోలీసులు వేసిన ఎత్తుగడ అంటున్నారు. మావోయిస్టు కేడర్ ను గందరగోళంలో పడేసేందుకు, అగ్రనేతల ఫోన్ సంభాషణ విని, గణపతి ఎక్కడున్నాడో తెలుసుకొనేందుకు పోలీసులు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారని అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి..గణపతి లొంగిపోతాడా ? తదితర వివరాలు తెలియాలంటే..కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.